తాప్సికి మ‌రో మార్గం లేదు మ‌రి!

టాలెంట్ ఉన్నా – హిట్లు లేక‌పోవ‌డంతో తాప్సి కెరీర్ మ‌రీ డ‌ల్ అయిపోయింది. తెలులు, త‌మిళం, హిందీ… ఇప్పుడు మూడు చోట్లా ఖాళీ అయిపోయింది. రాబోయే రోజుల్లో అవ‌కాశాలు వ‌స్తాయ‌న్న గ్యారెంటీ లేదు. అందుకే…

టాలెంట్ ఉన్నా – హిట్లు లేక‌పోవ‌డంతో తాప్సి కెరీర్ మ‌రీ డ‌ల్ అయిపోయింది. తెలులు, త‌మిళం, హిందీ… ఇప్పుడు మూడు చోట్లా ఖాళీ అయిపోయింది. రాబోయే రోజుల్లో అవ‌కాశాలు వ‌స్తాయ‌న్న గ్యారెంటీ లేదు. అందుకే త‌న‌కు తాను అవ‌కాశాలు క‌ల్పించుకోవ‌డానికి నిర్మాత‌గా మార‌బోతోంది. 

త‌మిళంలో మంచి టాక్ అందుకొన్న గంగ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాల‌ని తాప్సి నిర్ణయించుకొంద‌ట‌. అన్నట్టు గంగ‌లో తాప్సి కూడా న‌టించింది. త‌న పాత్రని మ‌ళ్లీ త‌నే హిందీలో పోషించ‌బోతోంద‌ట‌. 

ఈ సినిమాలో న‌టించేట‌ప్పుడే లారెన్స్ ద‌గ్గర తాప్సి మాట ఇచ్చుకొంద‌ట‌. దానికి లారెన్స్ కూడా ఓకే అన‌డంతో.. ఈ సినిమా బాలీవుడ్‌కి వెళ్లబోతోంది. క‌థానాయిక‌లు నిర్మాత‌లుగా మార‌డం కామ‌నే. అయితే అందులో విజ‌యాలు అందుకొన్నవాళ్లుమాత్రం లేరు. మ‌రి తాప్సి అదృష్టం ఎలా ఉందో?