రాంగోపాల్ వర్మ నే కాదు.. ఆయన శిష్యబృందానికీ టిపికల్ మెంటాలిటీ. అందరికి నచ్చేది వాళ్లకు నచ్చదు. వాళ్లకు నచ్చేది మిగిలినవాళ్లకు నచ్చదు. పెళ్లి – మానవ సంబంధాలు.. వీటికి వర్మ అండ్ కో అంతగా విలువ ఇవ్వరు.
ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడా అదే మాట అంటున్నాడు.కొన్నాళ్లకు పెళ్లి అనే వ్యవస్థే ఉండదట. ఆడ, మగ మధ్య సహజీవనం, స్నేహితుల్లా కలసి బతకడం తప్ప మరే అనుబంధం ఉండదట. ఆడది లేకుండా మగాడు లేడు, మగాడు లేకపోతే ఆడది బతకదు.. కానీ వీళ్లిద్దరూ కలసి బతకలేరు – అంటూ ఓ కొత్త నిర్వచనం చెప్పాడు.
అంటే పూరి అర్థం ఏమిటి? ఆడ, మగ అనుబంధం కేవలం శారీరకమైనదేనా?? పెళ్లిపై ఇంత విరక్తిగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ పెళ్లిళ్లు చేసుకొన్నవాళ్లే. పెళ్లయ్యాకే వాళ్లకు ఈ నిజం బోధపడుతుందెందుకో అర్థంకాదు.