కుర్రాడు నలిగాడు

భారీ సినిమాలు బాహుబలి, శ్రీమంతుడు స్ట్రాంగ్ గా వుండగా, అటు కిక్ 2 ఎదర వుండగా మధ్యలో వచ్చాడు రాజ్ తరుణ్ 'సినిమా చూపిస్తా మావా' అంటూ. అప్పుడే అన్నారు..కుర్రాడు నలిగిపోతాడేమో? అని. అన్నట్లే…

భారీ సినిమాలు బాహుబలి, శ్రీమంతుడు స్ట్రాంగ్ గా వుండగా, అటు కిక్ 2 ఎదర వుండగా మధ్యలో వచ్చాడు రాజ్ తరుణ్ 'సినిమా చూపిస్తా మావా' అంటూ. అప్పుడే అన్నారు..కుర్రాడు నలిగిపోతాడేమో? అని. అన్నట్లే అయింది.

సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా, ఓపెనింగ్స్ వున్నా, తరువాత కలెక్షన్లు అంతగా లేవు. నలుగురు నిర్మాతల సినిమా కావడంతో పబ్లిసిటీ కూడా పెద్దగా లేదు. నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్ చేసుకున్నారు. శాటిలైట్, ఇతర అమ్మకాలతో, కానీ బయ్యర్లు ఇంకా సేఫ్ కు రావాలి.

కలెక్షన్లు అంతంత మాత్రంగా వున్నాయి. పోనీ టూర్ లాంటిది ప్లాన్ చేద్దామని హీరోకు వున్నా నిర్మాతలు ఎవరికి వారు అన్నట్లుగా వుండిపోవడంతో పుణ్యకాలం దాటిపోయింది. మరో నాలుగు రోజుల్లో కిక్ 2 రానే వస్తూంది.