బెల్లంకొండ సురేష్ బాగున్న రోజుల్లో అతని కొడుకు శ్రీనివాస్ తో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు బోయపాటి. అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. కానీ బెల్లంకొండ ఓడ కాస్తా బండి అయిపోయాక, అంత బడ్జెట్ మీకు లేదు కాబట్టి, సినిమా చేయలేనని అనేసాడు.
'తల తాకట్టు పెట్టి తెస్తా' అన్నా, బోయపాటి నమ్మలేదని వినికిడి. సరే, మొత్తానికి కిందా మీదా పడి బన్నీ సినిమాదొరకపుచ్చుకున్నాడు. చేస్తున్నాడు కూడా. ఈ లోగా బెల్లంకొండ దశ కాస్త తిరిగింది. కాంచన 2 హిట్ కావడంతో కాస్త డబ్బులు వచ్చాయి. బాకీలు చెల్లగొట్టేసాడని వినికిడి. సో, ఇప్పుడు డబ్బులున్నా లేకున్నా అప్పు అయితే పుడుతుంది.
అందుకని తన కొడుకు చేస్తున్న భీమనేని శ్రీనివాసరావు సినిమా పూర్తి కాగానే మళ్లీ బోయపాటిని సినిమా చేయమంటాడని టాలీవుడ్ టాక్. అసలే బోయపాటి సంక్రాతికి బన్నీ సినిమా పూర్తి చేసి, బాలయ్య బాబు వందో సినిమా అందుకోవాల్సి వుంది. ఇదే సమస్య అనుకుంటే బెల్లంకొండ లైన్లో అడ్డం పడితే అదో సమస్య అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రామిస్ ఎలా నెరవేరుస్తాడో బోయపాటి?