చేసినవి రెండు సినిమాలే కానీ, కానీ తనకంటూ ఓ స్టయిల్. ముఖ్యంగా సినిమాకు రీ రికార్డింగ్ అందించడంలో. అతడే సంగీత దర్శకుడు రాజేష్ మురుగేశన్. మలయాళం, తమిళంలో వచ్చిన నేరమ్, ఇటీవల పెద్ద హిట్ అయిన ప్రేమమ్ సినిమాలకు సంగీత దర్శకుడు.
ఇప్పుడు ఈ సంగీత దర్శకుడు తెలుగుకు కూడా పరిచయం అవుతున్నట్లు వినికిడి. నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ప్రేమమ్ తెలుగు వెర్షన్ కు రాజేష్ నే సంగీత దర్శకుడిగా పెట్టుకోవాలని, యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది.
ఫీల్ గుల్ లవ్ స్టోరీ ఒరిజినల్ కు రాజేష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పట్ల యూనిట్ చాలా ఇంప్రెసివ్ గా వుందని, అందుకే అతనినే తెలుగులో పరిచయం చేస్తే, కాస్త కొత్తగా వుంటుందని ఇలా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లు కావాలి. వారి కోసం వేట సాగుతోంది.