చరణ్‌ కూడా సారీ చెప్పేసాడు

ఎంత దిగ్గజ దర్శకుడైనా కానీ ఇప్పుడు ఒక హీరో డేట్స్‌ సంపాదించాలంటే.. గత వైభవం ఒక్కటీ ఉంటే సరిపోదు. వేగంగా సినిమా తీసిచ్చి, హిట్‌ గ్యారెంటీ ఇవ్వగలగాలి. లేదంటే ఫలానా దర్శకుడితో సినిమా చేసామనే…

ఎంత దిగ్గజ దర్శకుడైనా కానీ ఇప్పుడు ఒక హీరో డేట్స్‌ సంపాదించాలంటే.. గత వైభవం ఒక్కటీ ఉంటే సరిపోదు. వేగంగా సినిమా తీసిచ్చి, హిట్‌ గ్యారెంటీ ఇవ్వగలగాలి. లేదంటే ఫలానా దర్శకుడితో సినిమా చేసామనే సంతృప్తి, సంతోషం కోసం ఇప్పుడెవరూ సినిమాలు చేయట్లేదు. పోటీ విపరీతంగా పెరిగిపోయిన ఈ టైమ్‌లో ప్రతి సినిమా ఫలితం చాలా కీలకంగా మారింది. 

అందుకే మణిరత్నంలాంటి దర్శకుడు కూడా మన హీరోల నుంచి తిరస్కారం ఎదుర్కొంటున్నాడు. నాగార్జున, మహేష్‌బాబుతో ఒక సినిమా చేద్దామని మణిరత్నం ప్లాన్‌ చేసుకున్నాడు. నాగార్జున ఓకే అన్నాడు కానీ మహేష్‌ మాత్రం ఖాళీ లేదని చెప్పేసాడు. దాంతో చరణ్‌, అల్లు అర్జున్‌తో అదే సినిమా చేయాలని మణిరత్నం మొన్ననే చిరంజీవిని కలిసాడు. 

కానీ చరణ్‌ కూడా తాను చాలా బిజీగా ఉన్నానని, ఇప్పుడు ఒక సినిమాపై ఏడాదికి పైగా సమయం కేటాయించడం అసాధ్యమని, తనతో పని చేయడానికి సిద్ధంగా ఉన్న ఇతర దర్శకులని బాధ పెట్టలేనని సున్నితంగా ఈ ఆఫర్‌ని తిరస్కరించి మణిరత్నంకి సారీ చెప్పేసాడు. మణిరత్నంతో చేయడానికి తమిళ హీరోలు సదా సిద్ధంగా ఉంటే ఆయన ఎందుకు తెలుగు హీరోల వెంట తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు.