సమంతా మజాకా!

సమంత మరోసారి తన లక్కీ లెగ్‌ పవర్‌ ఏంటో చూపిస్తోంది. చాలా హిట్‌ చిత్రాల్లో నటించి లక్కీ హీరోయిన్‌ అనిపించుకున్న సమంత ఇప్పుడు మనంతో మరోసారి తాను అదృష్ట లక్ష్మిని అని చాటుకుంటోంది. ఈ…

సమంత మరోసారి తన లక్కీ లెగ్‌ పవర్‌ ఏంటో చూపిస్తోంది. చాలా హిట్‌ చిత్రాల్లో నటించి లక్కీ హీరోయిన్‌ అనిపించుకున్న సమంత ఇప్పుడు మనంతో మరోసారి తాను అదృష్ట లక్ష్మిని అని చాటుకుంటోంది. ఈ చిత్రంతో ఆమె కెరీర్‌లో మరో బిగ్‌ హిట్‌ యాడ్‌ అయింది. మిగతా హీరోయిన్లు హిట్లు కొట్టి తనకి సవాల్‌ విసిరినప్పుడల్లా సమంత గట్టిగా ఆన్సర్‌ ఇస్తుంటుంది. 

ఈ ఏడాదిలో శృతిహాసన్‌ రెండు పెద్ద హిట్స్‌ ఇచ్చి సమంతకి సవాల్‌ విసిరింది. దానికి మనంతో సమంత సరైన సమాధానమే ఇచ్చింది. పైగా నటిగా మరింత మంచి పేరు కూడా తెచ్చుకుంది. అత్తారింటికి దారేది తర్వాత రామయ్యా వస్తావయ్యాతో ఫ్లాప్‌ చవి చూసిన సమంత మధ్యలో ఎక్కువగా తమిళ చిత్రాలు ఒప్పుకుని తెలుగులో తక్కువగా కనిపించింది. 

మనంతో ఆమె తన అగ్ర స్థానాన్ని పదిలంగా కాపాడుకుంది. ఎలాగో త్వరలో ఆమె నటించిన అంజాన్‌, రభస చిత్రాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి కాబట్టి ఇప్పట్లో సమంత పొజిషన్‌కి ఏ ఢోకా లేదు. ఆమెని నంబర్‌వన్‌ స్థానం నుంచి తప్పించాలంటే మిగతా హీరోయిన్లు డబుల్‌ కష్టం పడి తీరాలంతే.. ఇంకో దారి లేదు.