తెలుగు తెరపై సన్నీలియోన్‌

ఓ తెలుగు సినిమాలో సన్నీలియోన్‌ నటిస్తోందన్న వార్త అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా ఆ సినిమాలో గ్లామరస్‌గా కాకుండా, పద్ధతిగా కన్పించనుందనే వార్తలతో ఆ షాక్‌ ఇంకా గట్టిగా తగిలింది గ్లామర్‌ ప్రియులకి. Advertisement తెలుగు…

ఓ తెలుగు సినిమాలో సన్నీలియోన్‌ నటిస్తోందన్న వార్త అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా ఆ సినిమాలో గ్లామరస్‌గా కాకుండా, పద్ధతిగా కన్పించనుందనే వార్తలతో ఆ షాక్‌ ఇంకా గట్టిగా తగిలింది గ్లామర్‌ ప్రియులకి.

తెలుగు సినిమా సంగతి పక్కన పెడితే, అరవ సినిమాతో తెలుగు తెరపై కన్పించేందుకు సన్నీలియోన్‌ రెడీ అయిపోయింది. ఆమె నటించిన ఓ తమిళ సినిమా తెలుగులోకి ‘కుల్ఫీ’ పేరుతో విడుదల కానుంది. జై ఈ సినిమాలో హీరో. హీరోయిన్‌ మన ‘కలర్స్‌’ స్వాతి కావడం మరో విశేషం.

సన్నీలియోన్‌ చేసింది ఐటమ్‌ సాంగే అయినా.. ఆమె చుట్టూనే ‘కుల్ఫీ’ పబ్లిసిటీ జరుగుతోంది. ఆమెకు అంత క్రేజ్‌ వుంది మరి. పోర్న్‌ సినిమాల్లోంచి బాలీవుడ్‌ తెరపైకొచ్చిన సన్నీలియోన్‌, బాలీవుడ్‌లోనూ అందాల ప్రదర్శనతోనే నెట్టుకొచ్చేస్తోంది. తెలుగులో నటిస్తోన్న సినిమాలో ఆమె ఏం చేస్తుందో వేచి చూడాలి. ఈలోగా ఊరించడానికన్నట్టు.. ‘కుల్ఫీ’ సినిమా ఐటమ్‌ సాంగ్‌తో హల్‌చల్‌ చేయనుంది సన్నీలియోన్‌ తెలుగు తెరపై.