మ‌న‌సు మార్చుకొన్న రాజ‌శేఖ‌ర్‌

వెండితెర‌పై రాజ‌శేఖ‌ర్ అంటే.. సాయికుమార్ గొంతు తో క‌లుపుకొనే. రాజ‌శేఖ‌ర్ లుక్స్‌కీ, బాడీ లాంగ్వేజ్‌కీ. డైలాగ్ డెలివ‌రీకీ సాయి కుమార్ గొంతు పోత‌పోసిన‌ట్టు స‌రిపోతుంది. సాయికుమార్ హీరో అయ్యాక డ‌బ్బింగుల‌కు దూర‌మ‌య్యాక రాశేఖ‌ర్‌కి హ్యాండిచ్చాక‌..…

వెండితెర‌పై రాజ‌శేఖ‌ర్ అంటే.. సాయికుమార్ గొంతు తో క‌లుపుకొనే. రాజ‌శేఖ‌ర్ లుక్స్‌కీ, బాడీ లాంగ్వేజ్‌కీ. డైలాగ్ డెలివ‌రీకీ సాయి కుమార్ గొంతు పోత‌పోసిన‌ట్టు స‌రిపోతుంది. సాయికుమార్ హీరో అయ్యాక డ‌బ్బింగుల‌కు దూర‌మ‌య్యాక రాశేఖ‌ర్‌కి హ్యాండిచ్చాక‌.. ఈ యాంగ్రీ యంగ్ మెన్ కెరీర్ డ‌ల్లయ్యింది. 

మ‌ధ్యలో మ‌ళ్లీ సాయికుమార్‌తో త‌న ప్రయాణం ప్రారంభించాడు. అయితే.. గ‌డ్డం గ్యాంగ్ విష‌యానికొస్తే రాజ‌శేఖ‌ర్‌కి ఓ విచిత్రమైన ఆలోచ‌న వ‌చ్చింది. తొలిసారి త‌న పాత్రకి తానే డ‌బ్బింగ్ చెప్పుకోవాల‌న్న ముచ్చట పెరిగింది. అందుకే తొలిసారి డ‌బ్బింగ్ చెప్పుకొన్నాడు. చివ‌రికి ఏమైందో ఇప్పుడు మ‌న‌సు మార్చుకొన్నాడు. తిరిగి సాయికుమార్ చేతే… ఆ పాత్రకు డ‌బ్బింగ్ చెప్పించాడు. 

అదేంట‌ని అడిగితే.. ''సాయికుమార్ గాత్రం నాకు బాగా సూట‌వుతుంది. ఎన్నో ఏళ్లుగా సాయిగొంతుకి ప్రేక్షకులు అల‌వాటు ప‌డిపోయారు. ఇప్పుడు హ‌ఠాత్తుగా నా గొంతు వినిపిస్తే ఫ‌లితంలో తేడా వ‌స్తుంద‌న్న భ‌యం క‌లిగింది. అందుకే మ‌ళ్లీ సాయికుమార్‌తో డ‌బ్బింగ్ చెప్పించాం'' అని స‌మాధానం ఇచ్చాడు. అన్నట్టు రేపు (బుధ‌వారం) రాజ‌శేఖ‌ర్ పుట్టిన రోజు. 6న గ‌డ్డం గ్యాంగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.