పబ్లిగ్గా పచ్చి బూతులు మాట్లాడుతూ… కలెక్ట్ అయిన మొత్తాన్ని చారిటీ కోసం ఉపయోగించిన ‘ఆల్ ఇండియా బక్చోద్ నాక్ అవుట్’ షోపై విమర్శలు తారాస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివి విదేశాల్లో చాలా మామూలు విషయాలైనా కానీ ఇండియన్ కల్చర్‌కి ఇది రివల్యూషనరీ అనుకోవాల్సిందే. ఒకవైపు ఈ షోకి గణనీయంగా ప్రశంసలు దక్కుతోంటే… అంతకు మించి విమర్శలు కూడా ఎదురవుతున్నాయి.
ఏదేమైనా కానీ అటు హేటర్స్, ఇటు సపోర్టర్స్ కలిసి యూట్యూబ్‌లో దీనిని హిస్టారికల్ హిట్ చేసేసారు. పర్పస్ సాల్వ్ అయింది కానీ దీంట్లో ఇన్వాల్వ్ అయిన సెలబ్రిటీస్ మాత్రం ఇది నచ్చని వారి నుంచి ‘మ్యూజిక్’ ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే డైరెక్టర్ కరణ్ జోహార్‌ని లిటరల్‌గా ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నారు.
తాను గే అని పబ్లిగ్గా అంగీకరించిన కరణ్ జోహార్ తన సెక్సువల్ డిజైర్స్ గురించి, పొజిషన్స్ గురించి కూడా ఈ షోలో సిగ్గు విడిచి మాట్లాడేసాడు. అతని మాటల్ని పట్టుకుని సాంప్రదాయవాదులు కరణ్ జోహార్‌ని కుళ్లబొడిచేస్తున్నారు. ‘మీ కప్ ఆఫ్ టీ కాకపోతే తాగకండి’ అంటూ వారికి కరణ్ తెలివిగా సమాధానమిచ్చాడు కానీ అతడి టైమ్‌లైన్ మాత్రం పచ్చి బూతులతో నిండిపోతోంది. బూతులు మాట్లాడ్డం మన సాంప్రదాయ విరుద్ధమని వాదించే వారే కరణ్‌ని అవే బూతులు తిట్టడమే ఐరనీ ఇక్కడ!