రామ్‌ చరణ్‌కి భయం పట్టుకుంది

రామ్‌ చరణ్‌ సినిమాలు కన్సిస్టెంట్‌గా నలభై కోట్ల మార్కు దాటిపోతున్నాయి. రచ్చ, నాయక్‌, ఎవడు చిత్రాలని మూస సినిమాలంటూ క్రిటిక్స్‌ విమర్శించారు కానీ అవన్నీ నలభై అయిదు కోట్లకి పైగా షేర్‌ వసూలు చేసి…

రామ్‌ చరణ్‌ సినిమాలు కన్సిస్టెంట్‌గా నలభై కోట్ల మార్కు దాటిపోతున్నాయి. రచ్చ, నాయక్‌, ఎవడు చిత్రాలని మూస సినిమాలంటూ క్రిటిక్స్‌ విమర్శించారు కానీ అవన్నీ నలభై అయిదు కోట్లకి పైగా షేర్‌ వసూలు చేసి హిట్‌ అనిపించుకున్నాయి. కాకపోతే అవన్నీ కూడా ఒకే రేంజ్‌కి పరిమితమై చరణ్‌ రేంజ్‌కి కూడా మేకు కొట్టేసాయి. 

‘గోవిందుడు అందరివాడేలే’తో కాస్త భిన్నంగా చేయాలని ప్రయత్నించాడు కానీ వినోదం మిస్‌ అయిన ఆ చిత్రం యావరేజ్‌గా మిగిలింది. అందుకే తన తాజా చిత్రం విషయంలో చరణ్‌ అస్సలు ఛాన్స్‌ తీసుకోవట్లేదు. శ్రీను వైట్లతో సినిమా చేయాలనేది ఫిక్స్‌ అయినా కానీ నాలుగు నెలలుగా ఆ చిత్రం కథా చర్చల దశలోనే ఉండిపోయింది తప్ప ముందుకి కదల్లేదు. 

శ్రీను వైట్లకి అసలు బలం కోన వెంకట్‌, గోపీమోహన్‌ అవడంతో.. వారి మధ్య ఉన్న విబేధాల్ని కూడా క్లియర్‌ చేసి వాళ్లని ఒక టీమ్‌గా చేసాడు. ఇదంతా చరణ్‌ని పీడిస్తోన్న సక్సెస్‌ భయం వల్లే అని సినీ నగర వాసులు చెప్పుకుంటున్నారు. 

మగధీర తర్వాత చరణ్‌ నుంచి అలాంటి సంచలన చిత్రమేదీ రాలేదు. హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకత కానీ, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేకించి ఫాలోయింగ్‌ కానీ ఏర్పడలేదు. మరోవైపు తన సమకాలికులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ… మరింత ముందుకి సాగుతున్నారు. సక్సెస్‌లు వస్తున్నాయని తేలిగ్గా తీసుకుంటే తర్వాత పరుగు అందుకోవడం అసాధ్యమని గ్రహించి చరణ్‌ ఇప్పుడే జాగ్రత్త పడుతున్నాడు.