యంగ్‌టైగర్ అంటూ అభిమానులు పిలుచుకునే ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద తన స్థాయిలో గర్జించి చాలా కాలమైంది. సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ నుంచి బ్లాక్‌బస్టర్ అనిపించుకున్న సినిమా రాలేదు. యమదొంగ, బృందావనం, బాద్షాలాంటి జస్ట్ హిట్స్ తప్ప ఫాన్స్ ఫీస్ట్ చేసుకునే లెవల్ హిట్టయితే ఎన్టీఆర్‌కి దక్కలేదు. ఆ ఆశల్ని టెంపర్ తీరుస్తుందని ఆశిస్తున్నారు.
ఎన్టీఆర్ క్యాలిబర్‌కి తగ్గ క్యారెక్టర్ అతడికి ఈమధ్య కాలంలో దక్కలేదని, ఒక్కసారి ఎన్టీఆర్ స్థాయికి తగ్గ పాత్ర కుదిరితే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఆది, సింహాద్రిలో చూసామని… మళ్లీ టెంపర్‌లోని ‘సబ్ ఇన్స్పెక్టర్ దయ’ క్యారెక్టర్ అలాంటి పాత్ర అని రచయిత వక్కంతం వంశీ చెబుతున్నాడు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ క్యారెక్జరైజేషనే పెద్ద హైలైట్ అని, ఆ పాత్రని ఎన్టీఆర్ ఇంకో లెవల్‌కి తీసుకెళ్లిపోయాడని తెలిపాడు.
ఎన్టీఆర్లోని నటుడ్ని పూర్తి స్థాయిలో వాడుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందనేది ‘టెంపర్’లో చూస్తారని వక్కంతం సవాల్ చేస్తున్నాడు. ఇతడు ఇంతకుముందు ఎన్టీఆర్‌కి అశోక్, ఊసరవెల్లి స్క్రిప్టులు అందించాడు. అవి యావరేజ్ అనిపించుకున్నాయి. ఈసారి అయినా ఎన్టీఆర్ క్యాలిబర్‌కి తగ్గ కథనే వంశీ ఇచ్చాడంటారా? ఫిబ్రవరి 13న చూద్దాం.