క్రానికల్ నెల రోజుల్లో మూడు కోట్లు కట్టాల్సిందే

వేల కోట్ల అప్పులు చేసి, బ్యాంకులను తిమ్మిన బమ్మిని చేసి, రకరకాలుగా రుణాలు పెంచేసుకుని, సతమతమవుతోంది డెక్కన్ క్రానికల్ మీడియా గ్రూపు. అయితే వివిధ స్టేజ్ ల్లో కేసులు వుండడం, ఆదాయం అవసరాలకు సరిపోతుండడంతో,…

వేల కోట్ల అప్పులు చేసి, బ్యాంకులను తిమ్మిన బమ్మిని చేసి, రకరకాలుగా రుణాలు పెంచేసుకుని, సతమతమవుతోంది డెక్కన్ క్రానికల్ మీడియా గ్రూపు. అయితే వివిధ స్టేజ్ ల్లో కేసులు వుండడం, ఆదాయం అవసరాలకు సరిపోతుండడంతో, ప్రస్తుతానికి బాకీలకు కట్టాల్సిన పని లేక, బండి లాగించేస్తోంది. 

ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో మళ్లీ కాస్త ఇబ్బందిపడేలా వుంది. నెల రోజుల్లో ఐసిఐసిఐ కి మూడు కోట్లు చెల్లించమని సుప్రీం కోర్టు ఆదేశించింది. తమ బ్యాంకుకు 12 కోట్ల బకాయిలు వుండడంతో, డిసి కి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ను వేలం వేయాలని బ్యాంకు నిర్ణయించింది. 

దీన్ని కోర్టుల ద్వారా అడ్డుకుంటూ వస్తోంది డిసి. ఇప్పుడు సుప్రీం ఈ వ్వవహారాన్ని తేల్చేసింది. నెల రోజుల్లో మూడు కోట్లు కట్టాలని లేకుంటే, అప్పుడు వేలం పై తమ ఆదేశాలు వెలువరిస్తామని కోర్టు స్పష్టం చేసింది. మరి ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి డీసి.