జాగ్రత్తగా ప్లాన్ చేసి, తక్కువలో సినిమా నిర్మించి, కాస్త పబ్లిసిటీ మీద దృష్టి పెడితే సినిమా నిర్మాణం లాభదాయకమే అని నిరూపించే దిశగా వున్నారు నిర్మాత మధుర శ్రీధర్. లేడీస్ అండ్ జెంటిల్ మన్ సినిమాను కోటిన్నరతో కానిచ్చారు. సినిమాకు మంచి రివ్వూలే వచ్చాయి కానీ, కలెక్షన్లు ఇంకా పుంజుకోవలసి వుంది.
సోమవారం పెరగలేదు కానీ, డ్రాప్ కాకపోవడం ఆనందం. అయినా ఈ డబ్బుల మీద ఆశపెట్టుకోలేదు మధుర శ్రీధర్. కోటి రూపాయిలు శాటిలైట్, 50 లక్షలు రీమేక్ హక్కులు వస్తే చాలని చూస్తున్నారు. బ్రేకీవన్ అయిపోతారు. ఇప్పుడు 15 నుంచి 20 వరకు కన్నడ హక్కుల రూపంలో వచ్చేసాయి. బాలీవుడ్, తమిళ హక్కులు కూడా కనీసం రెండూ కలిపి అన్నా ముఫై దాకా వస్తాయి. హిందీ డబ్బింగ్ టీవీ రైట్లు వుండనే వున్నాయి.
మాయ సినిమా విషయంలో తెలివైన పని చేసారు. పాతికో ముఫ్ఫయ్యో ఇస్తాం, హక్కులు ఇవ్వండంటే, అలా వద్దు స్టేక్ ఇమ్మని మర్డర్ 4లో ఇరవై శాతం స్టేక్ తీసుకున్నారు. బాలీవుడ్ మార్కెట్, మహేష్ భట్ పేరు రీత్యా అంతకన్నా ఎక్కువే గిట్టబాటు అయ్యే అవకాశం వుంది. సరే శాటిలైట్ డబ్బుల లాభాలు కాకుండా, మంచి కలెక్షన్లు సంపాదించే సరైన సినిమా మధుర శ్రీధర్ బ్యానర్ నుంచి ఎప్పుడు వస్తుందో?