నిర్మాణ రంగంలోకి సుమంత్

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫీల్ గుడ్ లుక్ వున్న హీరో సుమంత్. కానీ కాలం కలిసి రాలేదు. సరైన హిట్ పడలేదు. తాత అక్కినేని మరణం కలిగించిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకున్న…

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫీల్ గుడ్ లుక్ వున్న హీరో సుమంత్. కానీ కాలం కలిసి రాలేదు. సరైన హిట్ పడలేదు. తాత అక్కినేని మరణం కలిగించిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకున్న సుమంత్ తను హీరోగా ఓ సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు. 

ఆది నుంచీ అక్కినేని కుటుంబంతో మంచి సంబంధాలున్న శివనాగేశ్వరరావు దర్శకుడు. ఈ సినిమాకు సుమంత్ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన సగం, ఆయన మిత్రులు సగం పెట్టుబడి పెడుతున్నారు. 

అన్నపూర్ణ స్డూడియోస్ పతాకంపై సినిమా నిర్మాణం వుంటుంది. ఇద్దరు హీరోయిన్లు వుండే ఈ సినిమా కాస్త డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందిస్తున్నారు.