బాక్సాఫీస్‌ మంటెక్కిపోద్ది

సంక్రాంతికి భారీ విజయం రాకపోవడంతో ఈ ఏడాది తెలుగు సినిమాకి డల్‌గా స్టార్ట్‌ అయింది. పటాస్‌ విజయం కాస్త ఊరటనిచ్చినా కానీ భారీ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అయితే ఆ లెక్కే వేరేలా ఉంటుంది. వచ్చే…

సంక్రాంతికి భారీ విజయం రాకపోవడంతో ఈ ఏడాది తెలుగు సినిమాకి డల్‌గా స్టార్ట్‌ అయింది. పటాస్‌ విజయం కాస్త ఊరటనిచ్చినా కానీ భారీ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అయితే ఆ లెక్కే వేరేలా ఉంటుంది. వచ్చే వారంలో రాబోతున్న టెంపర్‌తోనే ఆ లోటు తీరిపోతుందని ఆశ పడుతున్నారు. ఫిబ్రవరి, మార్చి మాట ఎలా ఉన్నా కానీ ఈసారి వేసవి కాలంలో మాత్రం చాలా భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. 

లయన్‌, సన్నాఫ్‌ సత్యమూర్తి, రుద్రమదేవి, జిల్‌, దోచెయ్‌, కిక్‌ 2 వేసవి సెలవుల ఆరంభంలో విడుదల కానున్నాయి. బాహుబలి, శ్రీమంతుడు లేట్‌ సమ్మర్‌లో వచ్చే అవకాశముంది. ఇవి కాకుండా మీడియం బడ్జెట్‌ సినిమాలు, ఆసక్తి కలిగిస్తోన్న చిన్న సినిమాలు కూడా చాలానే క్యూలో ఉన్నాయి. వారానికి ఒకటైనా చెప్పుకోతగ్గ చిత్రం రిలీజ్‌ అవుతుంది కనుక బాక్సాఫీస్‌ యమ బిజీగా ఉంటుంది. 

వీటిలో అంచనాలున్న సినిమాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి కనుక కనీసం నాలుగైదు సూపర్‌హిట్స్‌ అయినా ఉంటాయని ఆశిస్తున్నారు. అదే జరిగితే ఈ వేసవిలో బాక్సాఫీస్‌ మంటెక్కిపోతుంది. అదే సమయంలో రద్దీ ఎక్కువయి యావరేజ్‌ సినిమాలు స్ట్రగుల్‌ అయ్యే ప్రమాదం కూడా గట్టిగానే ఉంది.