డైరక్టర్లు భలేగా వుంటారు. మెత్తనోడు దొరికితే మెత్తబుద్ధి అనే టైప్. మాంచి మాస్ ఇమేజ్, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ వున్న హీరో దొరికితే ఏం చేయాలి. బుద్దిగా ఫార్మాట్ లోనే సినిమా చేసుకోవాలి. కావాలంటే కాస్త డిఫరెంట్ వుండేలా చూసుకోవాలి. అప్పుడు ఏ మాత్రం బాగున్నా కలెక్షన్లు కుమ్మేస్తాయి. కానీ హీరో మహేష్ దగ్గరకు వచ్చేసరికి డైరక్టర్లు చాలా మంది ఇంకోలా ఆలోచిస్తున్నారు. మహేష్ సినిమా ఎలా వున్నా చూసేస్తారు. మన ప్రయోగాలు, కొత్ ఆలోచనలు ఇతగాడి మీదే తీర్చేసుకుందాం అని చూస్తున్నారు. దాంతో సినిమాలు చెక్కేస్తున్నాయి. ఆరంభం నుంచీ దాదాపు ఇదే తంతు.
చిన్నప్పుడెప్పుడో నీడ సినిమా చేసాడు. అందులో అన్న రమేష్ హీరో అనుకోండి. అది ప్రయోగాత్మక చిత్రమే. ఆ తరువాత బబ్లీ ఫేస్ తో వుండగానే వైవిఎస్ చౌదరి ఇద్దరు హీరోయిన్లను, పెళ్లి కాకుండానే కొడుకు పుట్టడం లాంటి కథను సమకూర్చి యువరాజు తీసాడు. మహేష్ నే పిల్లాడిలా వున్నాడు..అతనికి పిల్లాడేంటీ అన్నారు అప్పట్లో. సరే అది అయింది. జయంత్ సి పరాన్జీ కౌబాయ్ సినిమా అన్నాడు. తేజ వచ్చాడు..నిజం అంటూ ఓ ప్రయోగం లాంటి కథ ఎంచుకున్నాడు.
డైరక్టర్ శోభన్ ట్రాజెటిక్ ఎండింగ్ వున్న కథ తీసుకున్నాడు. ఎస్ జె సూర్య వచ్చాడు..రాత్రి ఒకలా, పగలు ఒకలా వుండే హీరో కథ అంటూ ప్రయోగం చేసాడు. గుణశేఖర్ సైనికుడు కూడా ఓ తరహా ప్రయోగమే. సురేందర్ రెడ్డి అతథి సంగతి తెలిసిందే. జల్సా, జులాయి అంటూ మాస్ సినిమాలు తీసిన త్రివిక్రమ్ మహేష్ దగ్గరకు వచ్చేసరికి దేవుడు..అంటూ ఖలేజా తీసి చేతిలో పెట్టాడు.
సుకుమార్ వన్ అంటూ సైకలాజికల్ సినిమా చేసాడు. ఓ హిట్ ఇచ్చాడు కదా అనుకుంటే దాన్నే అటు ఇటు తిప్పి శ్రీనువైట్ల ఆగడు పేరుతో మరో ట్రయిల్ వేసాడు. ఈ లెక్కన పూరియే బెటరేమో..ఏ ప్రయోగం చేయకుండా మంచికో చెడ్డకో రెండు సినిమాలు తీసాడు.
మొత్తానికి తొంభై శాతం డైరక్టర్లు మహేష్ సినిమాలతో చెడుగుడు ఆడుకున్నవాళ్లే.