ఫ్లాప్‌ హీరోని పట్టించుకుంటారా?

డా॥ రాజశేఖర్‌కి హిట్‌ వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. గోరింటాకు తర్వాత విజయం ఎరుగని రాజశేఖర్‌ సినిమాలు కొనడానికి కూడా ఎవరూ ముందుకి రాని పరిస్థితి ఉంది. అందుకే పూర్తయినా కానీ కొన్ని సినిమాలు ఇంకా…

డా॥ రాజశేఖర్‌కి హిట్‌ వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. గోరింటాకు తర్వాత విజయం ఎరుగని రాజశేఖర్‌ సినిమాలు కొనడానికి కూడా ఎవరూ ముందుకి రాని పరిస్థితి ఉంది. అందుకే పూర్తయినా కానీ కొన్ని సినిమాలు ఇంకా విడుదల కాకుండా ఆగిపోయి ఉన్నాయి. 

కానీ ‘గడ్డం గ్యాంగ్‌’తో తన పరిస్థితిలో మార్పు వస్తుందని రాజశేఖర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాడు. తమిళంలో విజయవంతమైన సూదుకవ్వం అనే చిత్రానికి రీమేక్‌ ఇది. రాజశేఖర్‌ స్వీయ నిర్మాణంలో చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న రిలీజ్‌ అవుతోంది. పూర్తయి విడుదల కాకుండా ఉన్న తన సినిమాలు ఇంకా చాలా ఉన్నా కానీ ముందుగా దీనినే రిలీజ్‌ చేస్తున్నాడు. 

గడ్డం గ్యాంగ్‌ హిట్‌ అయితే ఆగిపోయిన పట్టపగలు, వందకు వంద, అర్జున చిత్రాలని కొనేందుకు ఎవరైనా వస్తారనేది రాజశేఖర్‌ ఆశ. కానీ ఏనాడో మర్చిపోయిన రాజశేఖర్‌ని ప్రేక్షకులు సీరియస్‌గా తీసుకుని థియేటర్లకి వస్తారా అనేదే చూడాలి. అసలే గడ్డం గ్యాంగ్‌ తర్వాత వారం రోజులకే టెంపర్‌ వస్తోంది. కనుక ఈ గ్యాంగ్‌ ప్రూవ్‌ చేసుకోవడానికి వారం రోజులకి మించి టైమ్‌ కూడా లేదు.