ప్రచారంపై ‘శీమంతుడు’ ఫుల్ బిజీ

మహేష్ బాబు తొలిసారి తన సినిమా ప్రచారం విషయంలో చాలా పర్టిక్యులర్ గా వున్నారు. సినిమా విడుదలకు నెల ముందు నుంచే చాలా ప్లాన్డ్ గా వెళ్లారు. అది కలిసి వచ్చింది కూడా. ఇప్పుడు…

మహేష్ బాబు తొలిసారి తన సినిమా ప్రచారం విషయంలో చాలా పర్టిక్యులర్ గా వున్నారు. సినిమా విడుదలకు నెల ముందు నుంచే చాలా ప్లాన్డ్ గా వెళ్లారు. అది కలిసి వచ్చింది కూడా. ఇప్పుడు పోస్టు పబ్లిసిటీ కూడా అదే విధంగా చేస్తున్నారు. సినిమా శాటిలైట్ తో కలిపి 80 కి రీచ్ అయినా, షేర్ ప్లస్ శాటిలైట్ కలిపి వంద కొట్టాలనే పట్టుదలతో వున్నారు. అందుకే మరింత పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. 

డిఫరెంట్ కాంబినేషన్లలో చిట్ చాట్ లు, ఇంటర్వూలు తయారు చేసి, చానెళ్లకు ఇచ్చే పనిలో బిజీగా వున్నారు. శని, ఆది వారాలు మహేష్ ఈ పనికే కేటాయించారు. శనివారంనాడు మహేష్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, కొరటాల శివ కలిసి చిట్ చాట్ లో పాల్గొన్నారు. దీన్ని ఆవాస లో చిత్రీకరించారు. అదే విధంగా రేపు కూడా మరొ చిట్ చాట్ చిత్రీకరణ వుంది. మొత్తానికి శ్రీమంతుడి స్ట్రాటజీ బాగుంది.