కేదరనాథ్ ను ఖాళీ చేస్తున్న పూజారులకు 18 కోట్ల రూపాయలు!

వరసగా వరదలకు గురి అవుతున్న ప్రాంతం అయినా.. అక్కడ కొంతమంది స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకొన్నారు. ఆ హిందూ పవిత్రక్షేత్రంలో పూజలు చేసుకొనే పురోహితులు ప్రభుత్వం హెచ్చరికలు ఖాతరు చేయకుండా అక్కడే ఉంటున్నారు. అదేమంటే.. తమ…

వరసగా వరదలకు గురి అవుతున్న ప్రాంతం అయినా.. అక్కడ కొంతమంది స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకొన్నారు. ఆ హిందూ పవిత్రక్షేత్రంలో పూజలు చేసుకొనే పురోహితులు ప్రభుత్వం హెచ్చరికలు ఖాతరు చేయకుండా అక్కడే ఉంటున్నారు. అదేమంటే.. తమ కుటుంబాలు శతాబ్దాలుగా అక్కడే ఉంటున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో తాము అక్కడ నుంచి పక్కకు కదల్లేమని వారు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా అక్కడ నుంచి పురోహితుల కుటుంబాలను ఖాళీ చేయించడానికి ప్రభుత్వం భారీ ప్యాకేజీని ఆఫర్ చేసింది.

కేదరనాథ్ ఆలయ ప్రాంతంలో 110 కుటుంబాల వారు శాశ్వతనివాసాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. వీరిలో ఒక్కో కుటుంబానికి ఏకంగా పదహారు లక్షల పాయల పరిహారాన్ని ఆఫర్ చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. మొత్తం పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ పరిహారం ద్వారా వారిని సంతృప్తి పరిచి అక్కడ నుంచి తరలిస్తోంది. ఇన్ని రోజులూ ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోక ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ఒప్పుకోని పురోహితుల కుటుంబాలు ప్రభుత్వ ప్యాకేజీతో సంతృప్తి పడుతున్నాయి. అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయి జీవించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి.

మరి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకొన్నాకా.. భారీ సంఖ్యలో మరణాలు నమోదయ్యాకా.. ఒక్కో క్యాజువాలిటీకి లక్షల్లో పరిహారం ఇవ్వడం కంటే.. ఈ విధంగా ముందస్తుగానే వారిని దూర ప్రాంతాలకు పంపడం.. అందుకు సమ్మతించకపోతే వారికి ఈ విధమైన పరిహారం ఇచ్చి పంపడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి అని చెప్పాలి. ఈ విషయంలో ఉత్తరాఖండ్ సర్కారును అభినందించాలి.