క్రిష్ ఫిదా అయిపోయాడు

బేబి సారా..చిచ్చర పిడుగు. పూర్వజన్మ సుకృతం అనుకోవాలి ఆ పాప నటన చూస్తే. నాన్న సినిమాలో ఆమెతో నడించిన విక్రమ్ లాంటి నటుడే చలించిపోయాడు. ఇప్పుడు దాగుడుమూతల దండాకోర్ లో ఆమె నటన చూసి…

బేబి సారా..చిచ్చర పిడుగు. పూర్వజన్మ సుకృతం అనుకోవాలి ఆ పాప నటన చూస్తే. నాన్న సినిమాలో ఆమెతో నడించిన విక్రమ్ లాంటి నటుడే చలించిపోయాడు. ఇప్పుడు దాగుడుమూతల దండాకోర్ లో ఆమె నటన చూసి ఆ సినిమా నిర్మాణ భాగస్వామి క్రిష్ షాక్ అయిపోయాడట. 

ఎవరు క్రిష్ ను ఆ సినిమా గురించి అడిగినా ముందు బేబీ సారా నటన గురించే చెబుతున్నాడు. ఆమె నటన ముందు మరెవరి నటనా కనిపించదని అంటున్నాడట. తమిళ శైవం సినిమాకు అనువాదం ఈ సినిమా. 

తాత, మనవరాలి మధ్య ఆప్యాయతలు అనుబంధాల నేపథ్యంలో పాప మక్కువ పడిన ఓ కోడిని, ఇంటి సభ్యులు బలిచ్చేయాలనుకుంటే, ఏర్పాడిన సంఘర్షణే ఈసినిమా. తమళంలో మంచి హిట్ అయిన ఈ సినిమాను ఉషాకిరణ్ సంస్థ, క్రిష్ తో కలిపి నిర్మిస్తోంది.