ఈ మధ్యన టాలీవుడ్ ను లీకులు వణికిస్తున్నాయి. ఎవరో, ఆకతాయిగానో, అల్లరి పెట్టడానికో చేసిన పని కోట్లు ఖర్చుచేసిన నిర్మాతలకు కంగారు పుట్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న బాహుబలి వ్యవహారం ముగిసింది. ఇప్పుడు నిజమో, అబద్ధమో తెలియదు కానీ, రుద్రమదేవి సీన్లు కూడా లీక్ అయ్యాయని వినిపిస్తోంది టాక్.
ఓరుగల్లు కోట మీద నుంచి తాళ్ల సాయంతో అనుష్క దిగడం, అల్లు అర్జున్ కత్తి పట్టుకుని పరుగెత్తడం వంటి సీన్లు, రీ షూట్ వంటివి ఈ లీక్ లో వున్నాయని తూర్పుగోదావరి జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీన్లు కూడా అంత క్లారిటీగా లేవని, మబ్బు మబ్బుగా వున్నాయని అంటున్నారు.
కొన్ని దుకాణాల్లో వీటిని బ్లూటూత్ లు ద్వారా షేర్ చేసుకుని చూసారని అంటున్నారు. అయితే నిజం ఎంతో అన్నది మాత్రం తెలియదు. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే ఈ టాక్ పుట్టినట్లు తెలుస్తోంది.