అతడు 2 అంటే పార్ధు

మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి చేయేబోయే సినిమాకు పార్థు అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మించే హాసిని సంస్థ ఈ మేరకు పేరు రిజిస్టర్ చేయించినట్లు బోగట్టా. అయితే పార్దు అన్న…

మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి చేయేబోయే సినిమాకు పార్థు అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మించే హాసిని సంస్థ ఈ మేరకు పేరు రిజిస్టర్ చేయించినట్లు బోగట్టా. అయితే పార్దు అన్న టైటిల్ బయటకు రావడంతో రకరకాల ఊహాగానాలు ప్రారంభమైపోయాయి. 

అతడు సినిమాలో మహేష్ బాబు పేరు పార్థు. అది బాగా పాపులర్ అయిపోయింది కూడా. బహుశా అతడు 2 క సీక్వెల్ కానీ ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానం కూడా వినిపిస్తోంది. నిజానికి అక్కడ సీక్వెల్ చేయడానికి చాన్స్ తక్కువ. 

ఎందుకంటే హీరో, ప్రేమ, ఇతరత్రా వ్యవహారాలు అన్నీపూర్తయిపోయాయి అతడులోనే. మరి పార్ట్ 2 ఎలా సాధ్యం? బహుశా అదే క్యారెక్టర్ స్పూర్తిగా మరో కథ అల్లుకుంటూ వుండొచ్చు. లేదా పేరు బాగుందని ఫిక్సయి వుండొచ్చు. అవను అన్నీ బాగానే వున్నాయి కానీ, మహేష్ మూడు అక్షరాల సెంటిమెంట్ మాటేమిటి?