ఉషాకిరణ్ లో అనీష్ కృష్ణ

అలా ఎలా అంటూ చిన్న సినిమా తీసి, మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు అనీష్ కృష్ణ. మౌత్ టాక్ ద్వారా సినిమా దాని రేంజ్ కు బాగానే ఆడేసింది. అందుకే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది.…

అలా ఎలా అంటూ చిన్న సినిమా తీసి, మంచి పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు అనీష్ కృష్ణ. మౌత్ టాక్ ద్వారా సినిమా దాని రేంజ్ కు బాగానే ఆడేసింది. అందుకే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ పిలిచి ఆఫర్ ఇచ్చింది. మాంచి రొమాంటిక్ క్రైమ్ థిల్లర్ లైన్ ను ఓకె చేసారని వినికిడి. 

ప్రస్తుతం అనీష్ కృష్ణ ఆ సబ్జెక్ట్ పై వర్క్ చేస్తున్నారు. గడచిన కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా వున్న ఉషాకిరణ్ సంస్థ ఒక్కసారిగా మళ్లీ స్పీడందుకుంది. ఈ నెలలో దాగుడుమూతల దండాకోర్ విడుదల కాబోతోంది.