గీతా ఆర్ట్స్‌ ‘చరణ్‌ అర్జున్‌’

రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ కలిసి ఒక చిత్రంలో నటించబోతున్నారా? నటిస్తున్నారో లేదో అనేది ఇంకా అధికారికంగా తెలీదు కానీ గీతా ఆర్ట్స్‌పై ఈ టైటిల్‌ మరోసారి రెన్యువల్‌ అయింది. ఈ టైటిల్‌ని ఎప్పట్నుంచో…

రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ కలిసి ఒక చిత్రంలో నటించబోతున్నారా? నటిస్తున్నారో లేదో అనేది ఇంకా అధికారికంగా తెలీదు కానీ గీతా ఆర్ట్స్‌పై ఈ టైటిల్‌ మరోసారి రెన్యువల్‌ అయింది. ఈ టైటిల్‌ని ఎప్పట్నుంచో హోల్డ్‌లో ఉంచిన అల్లు అరవింద్‌ మరొక్కసారి దానిని రెన్యువల్‌ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. 

మల్టీస్టారర్ల హవా ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో ఎక్కువవుతోంది. అయితే ఒకే జనరేషన్‌కి చెందిన ఇద్దరు పెద్ద స్టార్స్‌ కలిసి ఒక ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ మల్టీస్టారర్‌ అయితే ఇంతవరకు చేయలేదు. ముఖ్యంగా ఇప్పుడు అమితమైన ఫాలోయింగ్‌ ఉన్న ఇద్దరు టాప్‌ స్టార్స్‌ కలిసి సినిమా చేస్తే దానికి వచ్చే క్రేజ్‌ అలా ఇలా ఉండదు. 

చరణ్‌, అర్జున్‌ కనుక కలిసి మల్టీస్టారర్‌ చేసినట్టయితే తప్పకుండా బాక్సాఫీస్‌ షేకవుతుంది. వారిద్దరితో మల్టీస్టారర్‌ చేయడానికి అల్లు అరవింద్‌ కంటే బెటర్‌ ప్రొడ్యూసర్‌ ఉండరు. ఆయన మదిలో అయితే ఈ కాంబినేషన్‌లో సినిమా చేయాలనే ఉంది. అందుకే టైటిల్‌ని రెన్యువల్‌ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇద్దరికీ సరిపోయే కథ సెట్‌ అవడం మాత్రం అంత తేలిక కాదులెండి.