పూరి జగన్నాథ్‌లాంటి స్టార్ డైరెక్టర్ తమ్ముడై ఉండీ ఇంతవరకు హీరోగా బ్రేక్ సాధించలేకపోయాడు సాయిరామ్ శంకర్. తమ్ముడిని హీరోగా నిలబెట్టడానికి పూరి జగన్నాథ్ ఎత్తని అవతారం లేదు. అతను హీరోగా పూరి దర్శకత్వంలో, నిర్మాణంలో, రచనా సారథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. అయితే సాయిరామ్ శంకర్‌కి మాత్రం కాలం కలిసి రాలేదు.
పేరున్న దర్శకులు, కొత్త దర్శకులు కూడా సాయిరామ్ శంకర్‌ని హీరోగా నిలబెట్టలేకపోయారు. ఇప్పటికే దాదాపు డజను చిత్రాల్లో నటించిన సాయిరామ్ తాజాగా ‘రోమియో’ అనే చిత్రంతో మన ముందుకి వస్తున్నాడు. పూరి జగన్నాథ్ రాసిన స్టోరీతో గోపీ గణేష్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం చాలా కాలంగా విడుదల కాకుండా ఆగిపోయి ఉంది.
ఎట్టకేలకు ఈ శుక్రవారం వెలుగు చూస్తోన్న ఈ చిత్రం సాయిరామ్‌కి హీరోగా బ్రేకిస్తుందా? రవితేజ ఇందులో అతిథి పాత్ర పోషించాడు. సినిమాపై నమ్మకం బాగా ఉండడంతో విడుదలకి ముందు రోజే ప్రీమియర్ షో కూడా వేస్తున్నారు. అయితే ఇంతకాలం ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించలేకపోయిన సాయిరామ్ శంకర్ ఇప్పటికిప్పుడు ఆ అయస్కాంత శక్తి అందిపుచ్చుకుంటాడా అనేదే చూడాలి.