పాక్ సైన్యాన్ని పరుగులు పెట్టించిన ఇండియన్ ఆర్మీ..!

ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకే జడిశారో ఏమో కానీ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఐఏఎఫ్, బీఎస్ఎఫ్.. తదితర సైనికాదళ ఉన్నతాధికారులందరినీ పిలిపించుకొని మాట్లాడారట. పాక్ దళాలనూ, ఉగ్రవాద మూకలను కంట్రోల్ చేయడానికి సర్వ స్వతంత్రం ఇస్తున్నామని…

ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకే జడిశారో ఏమో కానీ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఐఏఎఫ్, బీఎస్ఎఫ్.. తదితర సైనికాదళ ఉన్నతాధికారులందరినీ పిలిపించుకొని మాట్లాడారట. పాక్ దళాలనూ, ఉగ్రవాద మూకలను కంట్రోల్ చేయడానికి సర్వ స్వతంత్రం ఇస్తున్నామని చెప్పి పంపించారట…. ఇంకేముంది, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు తమ తుపాకులకు తుప్పు వదిలించారని తెలుస్తోంది. పాక్ మూకలపై విరుచుకుపడినట్టు సమాచారం.

దాదాపు రెండు వందల కిలోమీటర్ల పరిధిలోని నియంత్రణ రేఖ పొడవునా భారత సైన్యం గర్జించింది. భారత దళాలు మొత్తం 37 పాకిస్తానీ బోర్డర్ పోస్టులను లక్ష్యంగా చేసుకొన్నాయి. ఈ దాడుల్లో దాదాపు 35 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని… పాక్ బోర్డర్ పోస్టులు పూర్తిగా పనికిరాకుండా పోయాయని.. దీంతో పాక్ సైనికులు దిక్కులు చూడకుండా పారిపోయాయని ఇంటెలిజన్స్ వర్గాలు తెలిపాయి. 

పాకిస్తాన్ సైన్యం ఈ తరహా స్పందనను అస్సలు ఎక్స్ పెక్ట్ చేయనట్టుగా ఉంది. ఇన్ని రోజులూ కాల్పుల నియంత్రణ అనేది తమకు మాత్రమే తెలిసిన విద్యగా భావించిన శత్రు సైన్యాలు భారత దళాలు విరుచుకుపడే సరికి సమాధానం చెప్పలేకపోయాయి. వెంటనే వాళ్లు ఐక్యరాజ్యసమితి కి ఫిర్యాదు చేయడం వరకూ వెళ్లడమే ఇక్కడ విశేషం. భారత సైన్యం ఇచ్చిన స్ట్రాంగ్ రియాక్షన్ తో పాక్ వైపు నుంచి ఇప్పుడు కాల్పుల విరమణ గురించి డిమాండ్ వినిపిస్తోంది. తమ వైపు నుంచి కాల్పులను ఆపివేసిన పాక్ సైన్యం …యూఎన్ మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ కు ఫిర్యాదు చేసి ఇండియాను కంట్రోల్ చేయాలని భావిస్తోంది.

అధికారిక సమాచారం ప్రకారం భారత సైన్యం చేసిన దాడిలో  35 మంది పాక్ సైనికులు చనిపోయారని చెబుతుండగా…. పాక్ కు ఈ నష్టం మరింత ఎక్కువ గా ఉందని తెలుస్తోంది. వంద మంది వరకూ పాక్ సైనికులు చనిపోయారని.. బోర్డర్ దాటే ప్రయత్నంలో ఉన్న నాలుగువందల మంది ఉగ్రవాదుల్లో డెబ్బై ఎనబై మంది పిట్టల్లా రాలిపోయారని.. మిగిలిన వాళ్లు తిరిగి పాక్ వైపు పారిపోయారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మొత్తానికి భారత సైన్యం ఇచ్చిన షాకింగ్ రిప్లైతో పాక్ సైన్యం బిత్తరపోయిందని చెప్పవచ్చు.