రామ్ చరణ్ మరోసారి తన స్టార్‌డమ్, క్రౌడ్ పుల్లింగ్ కేపబులిటీస్‌ని ‘గోవిందుడు అందరివాడేలే’తో చూపించాడు. ఈ చిత్రం తొలి వారంలో ముప్పయ్ అయిదు కోట్లకి పైగా షేర్ సాధించి.. నలభై కోట్ల దిశగా ఉరకలు వేస్తోంది. మంగళ, బుధ వారాల్లో కలెక్షన్స్ కాస్త తగ్గినా కానీ షేర్స్ బాగానే వచ్చాయి. ఈ ట్రెండు ప్రకారం వీకెండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని ట్రేడ్ ఎక్స్‌పెక్టేషన్.
ఇకపోతే ఈ చిత్రం విడుదలకి ముందు ఒక పాటని కత్తిరించారనే సంగతి తెలిసిందే. సగం పాట షూటింగ్ జరిగినా కానీ మిగతాది షూట్ చేయకుండా అలాగే ఆపేసారు. సినిమా రిజల్ట్‌ని చూసి రెండవ వారంలో పాటని యాడ్ చేద్దామని అనుకున్నారు. ఇంకా ఆ పాట ఉంటుందా లేదా అనేది మాత్రం తేల్చలేదు.
గోవిందుడు రెండవ వారంలో ప్రవేశించాడు కనుక బోనస్‌గా ఆ పాట జత చేసినట్టయితే మెగా అభిమానులు మరోసారి థియేటర్లకి వచ్చే అవకాశముంటుంది. ప్రస్తుతం గోవిందుడుకి పోటీనిచ్చే సినిమా ఏదీ లేదు కనుక ఈవారంలోనే ఆ పాటని జత చేస్తే ఫలితం ఉంటుంది. లేదంటే వచ్చే శుక్రవారం కొన్ని చెప్పుకోతగ్గ చిత్రాలు వస్తున్నాయి కనుక అప్పుడు ఒక్క పాట కోసం ఈ చిత్రం మళ్లీ చూడ్డానికి ఎక్కువమంది ఆసక్తి చూపించకపోవచ్చు.