అప్పుడు ఐష్‌.. ఇప్పుడు సన్నీలియోన్‌

బాలీవుడ్‌లో చాన్నాళ్ళ క్రితం వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’లోని ‘ధోలీ తారో’ పాటని అంత తొందరగా మర్చిపోలేం. సల్మాన్‌ఖాన్‌, ఐశ్వర్యారాయ్‌ల మధ్య చిత్రీకరించిన ఆ పాట అప్పట్లో…

బాలీవుడ్‌లో చాన్నాళ్ళ క్రితం వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’లోని ‘ధోలీ తారో’ పాటని అంత తొందరగా మర్చిపోలేం. సల్మాన్‌ఖాన్‌, ఐశ్వర్యారాయ్‌ల మధ్య చిత్రీకరించిన ఆ పాట అప్పట్లో పెను సంచలనం. అదే పాటని మళ్ళీ ఇప్పుడు రీమిక్స్‌ చేస్తున్నారు ‘లీలా’ సినిమా కోసం. బాబీఖాన్‌ దర్శకత్వంలో రూపొందుతోందీ సినిమా.

అప్పట్లో ఐశ్వర్యారాయ్‌ ‘ధోలీ తారో..’ అంటూ అద్భుతంగా పెర్ఫామ్‌ చేస్తే, ఆ పాటలో ఇప్పుడు కన్పించనున్నదెవరో కాదు, పోర్న్‌ సినిమా రంగం నుంచి బాలీవుడ్‌ సినిమాల్లోకొచ్చిన సన్నీలియోన్‌. ఈ సినిమాలో సన్నీలియోన్‌ రాకుమారిగా కన్పించనుంది. ఆమె మీద ‘ధోలీ తారో’ పాటను రీమిక్స్‌ చేసి చిత్రీకరించనున్నారు. మొదట్లో సన్నీలియోన్‌ డాన్సులు పెద్దగా ఎవర్నీ ఆకట్టుకోకపోయినా, ఇప్పుడామె డాన్సుల్లోనూ రాణిస్తోంది.

ఐశ్వర్యారాయ్‌ డాన్సుల్లో మేటి. ఆమె అందానికి ఎవరూ సాటి రారు కూడా. మరి, సన్నీలియోన్‌, తాజా ‘ధోలీ తారో’ పాటలో ఐశ్వర్యారాయ్‌ని మరిపిస్తుందా.? ఐష్‌ అందానికి ధీటుగా, ఐష్‌ అభినయానికి ధీటుగా, ఐష్‌ డాన్సులకు ధీటుగా సన్నీలియోన్‌ తనదైన ప్రత్యేకతను చాటుకుంటుందా.? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ‘లీలా’ సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.