వివాదాల్లో వర్మ ‘సావిత్రి’

రామ్‌గోపాల్‌ వర్మ అంటే సంచలనం.. రామ్‌గోపాల్‌ వర్మ అంటే వివాదం.. రామ్‌గోపాల్‌ వర్మ అంటే పబ్లిసిటీ.. పబ్లిసిటీ కోసమే ఆయనలా చేస్తారో.. ఆయన ఏం చేసినా అది వివాదాస్పదమవుతుందోగానీ.. ఒకప్పటి సంచలనం కన్నా.. ఇప్పుడు…

రామ్‌గోపాల్‌ వర్మ అంటే సంచలనం.. రామ్‌గోపాల్‌ వర్మ అంటే వివాదం.. రామ్‌గోపాల్‌ వర్మ అంటే పబ్లిసిటీ.. పబ్లిసిటీ కోసమే ఆయనలా చేస్తారో.. ఆయన ఏం చేసినా అది వివాదాస్పదమవుతుందోగానీ.. ఒకప్పటి సంచలనం కన్నా.. ఇప్పుడు వర్మ ఏది చేసినా వివాదాస్పదమవుతోంది.

తాజాగా వర్మ ‘సావిత్రి’ అనే సినిమా పోస్టర్‌ని దించారు. ఆ సినిమా పోస్టర్‌ ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. మహిళా సంఘాలు.. బాలల హక్కుల సంఘాలు వర్మకు వ్యతిరేకంగా నినదిస్తున్నాయి. సినిమా పోస్టర్‌లో మహిళను అసభ్యకరంగా చిత్రీకరించారనీ.. అమాయకుడైన ఓ చిన్నారి దృష్టి బీభత్సంగా ఎక్స్‌పోజింగ్‌ చేస్తోన్న మహిళ నాభిపైనా, ఆమె కాళ్ళ సందుల్లోనా వుండటం దారుణమైన విషయమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ తరహా సినిమాలు ఇదివరకు చాలానే వచ్చాయి.. భవిష్యత్తులోనూ వస్తుంటాయి. సెన్సార్‌ ఏం చేస్తుంది.? అన్నదే ఇక్కడ అసలు సిసలు ప్రశ్న. ‘ఐ లవ్‌ యూ టీచర్‌’ పేరుతో ఇలాంటిదే ఓ బూతు సినిమా వచ్చింది. అప్పట్లోనూ పెద్ద రచ్చే జరిగింది. మరి ఈ వివాదం ముందు ముందు ఎలా ముదురుతుందోగానీ, క్రియేటివిటీ పేరుతో అశ్లీలత ఎంతవరకు సబబు.! అన్నది ఆయా చిత్ర దర్శక నిర్మాతలు ఆలోచించుకుంటే మంచిదే.