జార్జియాలో ‘కంచె’

క్రిష్ వైవిధ్యమైన దర్శకుల్లో ఒకడు. సమ్ థింగ్ డిఫరెంట్ గా వుంటే తప్ప ఆయన సినిమాను తలకెత్తుకోడు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తో చేస్తున్న కంచె కూడా అలాంటిదేనంట. యుద్ధం నేపథ్యంలో జరిగే…

క్రిష్ వైవిధ్యమైన దర్శకుల్లో ఒకడు. సమ్ థింగ్ డిఫరెంట్ గా వుంటే తప్ప ఆయన సినిమాను తలకెత్తుకోడు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తో చేస్తున్న కంచె కూడా అలాంటిదేనంట. యుద్ధం నేపథ్యంలో జరిగే ప్రేమకథ. అటు యుద్ధరంగంలో, ఇటు పల్లెటూరిలో చిత్రీకరణ జరపుకున్న సినిమా. ఈ సినిమా కోసం క్రిష్ ఏకంగా జార్జియాకు వెళ్లిపోయాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే, జార్జియాలో వరల్డ్ వార్ 2 కు సంబంధించిన లోకేషన్లు కొన్ని వున్నాయి. అక్కడ రోజుకు ముఫై లక్షలకు పైగా ఖర్చు చేసి, దాదాపు రెండు నెలల పాటు షూట్ చేసారు. ఆ సీన్లన్నీ చాలా రియలిస్టిక్  వచ్చాయని క్రిష్ సన్నిహితులతో చెబుతూ, ఆనందిస్తున్నారట. కాస్త గ్యాప్ తో రెండు ఫస్ట్ లుక్ లు విడుదల చేసుకున్న ఈ సినిమా దసరా కోసం అక్టోబర్ 2న విడుదలకు రెడీ అయిపోతోంది.