బిసి సెంటర్లను ఆకట్టుకోవాలంటే కాస్త ఓవర్ యాక్షన్ తప్పని సరి అనుకుంటారు కొందరు. ఈ జాబితాలో చేరేటట్టే వున్నాడు రాజ్ తరుణ్. ఈ కుర్రాడు నటించిన సినిమా చూపిస్తా మావా..శుక్రవారం విడుదలవుతోంది.
సినిమాలో కుర్రాడి నటన కాస్త ఓవర్ గా వుందని ఇన్ సైడ్ టాక్. రావు రమేష్ ను ఓ రేంజ్ లో ఆడుకోవడానికి హీరోను రెచ్చిపోయేలా దర్శకుడు డిజైన్ చేసాడట. దాంతో కాస్త ఓవర్ యాక్షన్ లుక్ వచ్చిందని వినికిడి. సినిమాను కొంతమంది సినిమా జనం కోసం బుధవారం రాత్రి ప్రదర్శించారు.
చూసిన వారు ఫీలయిన వైనం ఇది. కానీ సినిమాను లవ్ చేసే వారు మాత్రం, కుర్రాడేంటీ, రావు రమేష్ ను మరీ ఏకవచనంతో అలా రెచ్చిపోవడం ఏమిటీ అన్నట్లు కూడా అనిపిస్తుందట. ఈ సినిమాలో రావు రమేష్ మామగారిగా, అవికా గౌర్ ప్రియురాలి గా నటించారు.