హిట్ అయిన సినిమాను మరింత హిట్ దిశగా ముందుకు తీసుకెళ్లే మార్గాలు కొన్ని వుంటాయి. వాటిలో జోడింపులు ఒకటి. పాట జోడించడమో, ఫైట్ జోడించమో, కామెడీ సీన్ జోడించడమో చేయడం. రెగ్యులర్ ప్రేక్షకులు కాకున్నా, ఫ్యాన్స్ మాత్రం ఈ సీన్లకోసం సినిమాకు వస్తారు. శ్రీమంతుడు సినిమాకు రిపీట్ ఆడియన్స్ రావడం కష్టం. ఎందుకంటే ఈ సినిమా సబ్జెక్ట్ అటువంటిది.
అందుకే శ్రీమంతుడు సినిమాకు కొన్ని సీన్లు జత చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కాస్త నిడివి ఎక్కువ అన్న కంప్లయింట్ వుంది. సో, ఇందుకోసం, ఇప్పటికి వున్నదాంట్లో, చాలా జాగ్రత్తగా, అస్సలు తెలియకుండా సీన్లలో ఎక్కడన్నా అడిషనల్ లెంగ్త్ వుంటే కట్ చేసి, ఈ కొత్త సీన్లు జోడించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా మహా అయితే అయిదారు నిమషాలకు మించి వుండకపోవచ్చు. ఇప్పటికి సినిమా 52 కోట్ల షేర్ వరకు వచ్చింది. 70 కోట్ల మార్క్ దాటాలాంటే కాస్త కష్టపడాలి. పబ్లిసిటీ, ఇతరత్రా కూడా.