కాజ‌ల్ మాట‌ల‌కు అర్థాలే వేరులే

ఇన్నేళ్ల కెరీర్‌లో కాజల్ ఎప్పుడూ కాంట్రవ‌ర్సీ జోలికి పోలేదు. త్రిష‌ల ఎఫైర్లు న‌డ‌ప‌లేదు. స‌మంత‌లా నోరు జారి మాట్లాడ‌లేదు. ఇలియానాలా టెంప‌ర్‌తో ప్రవ‌ర్తించ‌లేదు. తెలుగు సినిమాకి సంబంధించినంత వ‌ర‌కూ, మీడియా దృష్టిలో కాజ‌ల్ ఓ…

ఇన్నేళ్ల కెరీర్‌లో కాజల్ ఎప్పుడూ కాంట్రవ‌ర్సీ జోలికి పోలేదు. త్రిష‌ల ఎఫైర్లు న‌డ‌ప‌లేదు. స‌మంత‌లా నోరు జారి మాట్లాడ‌లేదు. ఇలియానాలా టెంప‌ర్‌తో ప్రవ‌ర్తించ‌లేదు. తెలుగు సినిమాకి సంబంధించినంత వ‌ర‌కూ, మీడియా దృష్టిలో కాజ‌ల్ ఓ మ‌చ్చలేని చంద‌మామ‌. 

అలాంటి కాజ‌ల్ ఈమ‌ధ్య కొన్ని కాంట్రవ‌ర్సీ స్టేట్ మెంట్లు ఇచ్చింది. త‌న కెరీర్ గురించి ప్రస్తావించుకొంటూనే, మిగిలిన వాళ్లు భుజాలు త‌డుముకొనేలా చేసింది. కాజ‌ల్ ఓ ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్ గురించి ప్రస్తావిస్తూ.. ''నేను ఎప్పుడూ ఎలాంటి కాంట్రవ‌ర్సీలోనూ త‌ల దూర్చలేదు.చాలామందిలా నేనేం ఎవ్వరితోనూ రాసుకుపూసుకొని తిర‌గ‌లేదు. నేను చాలా క్లీన్‌'' అంది. 

రాజుగారి రెండో భార్య చాలా అందంగా ఉంటుంది అంటే అర్థం ఏమిటి??  మొద‌టి భార్య ఏమంత బాగోద‌నే క‌దా. కాజ‌ల్ మాటల్లోనూ అర్థం అదే. నేను క్లీన్ అంటే.. మిగిలిన‌వాళ్లని వేలెత్తి చూపించిన‌ట్టేగా. ఇంత చిన్న విష‌యం కాజ‌ల్‌కి తెలీదా, ఏంటీ??  కాక‌పోతే ఫ్లోలో ఓ నిజం బ‌య‌ట‌పెట్టేసిందంతే.