ఈ విషయంలో పాక్ అటగాళ్లపై నిషేధం లేదా?!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాకిస్తాన్ ఆటగాళ్ల కు స్థానం లేదు. ఉగ్రవాదం కారణంగా చెడిపోయిన ఇండోపాక్ క్రికెట్ రిలేషన్స్ నేపథ్యంలో పాకిస్తానీ ఆటగాళ్లను ఐపీఎల్ వేలం నుంచి తొలగించారు. భారత క్రికెట్ నియంత్రణమండలి…

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాకిస్తాన్ ఆటగాళ్ల కు స్థానం లేదు. ఉగ్రవాదం కారణంగా చెడిపోయిన ఇండోపాక్ క్రికెట్ రిలేషన్స్ నేపథ్యంలో పాకిస్తానీ ఆటగాళ్లను ఐపీఎల్ వేలం నుంచి తొలగించారు. భారత క్రికెట్ నియంత్రణమండలి ఆధ్వర్యంలోని లీగ్ కాబట్టి.. ఈ విషయంలో పాకిస్తాన్ తరపు నుంచి వాదనకు అవకాశం లేకుండా పోయింది.

దీంతో ఐపీఎల్ లోని ఏ జట్టు తరపున కూడా ఒక్క పాకిస్తానీ ఆటగాడు కూడా లేకుండా పోయాడు. దీంతో పాకిస్తానీ ఆటగాళ్లు చాలానే ఫీలవుతున్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకొనే అవకాశం లేకుండా పోయిందని వారు బాధపడుతున్నారు.

అయితే కొంతమంది ఆటగాళ్లు మాత్రం ఎలాగోలా ఈ లీగ్ లో పాగా వేశారు! వసీం అక్రమ్.. రమీజ్ రాజా.. షోయాబ్ అక్తర్ వంటి ఆటగాళ్లు ఈ కాసుల లీగ్ లో  స్థానం సంపాదించుకొన్నారు. వసీం అక్రమ్ కోల్ కతా నైట్ రైడర్స్ కోచ్ లలో ఒకడిగా ఉన్నాడు.. అక్తర్ , రమీజ్ కామెంటరీ చెబుతూ.. ఎనలిస్టులుగా కొనసాగుతున్నారు.

అక్తర్ , రమీజ్ లతో ఐపీఎల్ లైవ్ హక్కులు కలిగిన సోనీ ఎంటర్ టైన్ మెంట్ వారు ఒప్పందం కుదర్చుకొన్నారు. అక్రమ్ తో కేకేఆర్ టీమ్ ఒప్పందం కుదుర్చుకొంది. మరి ఐపీఎల్ లో పాక్ జాడ లేకుండా చేసి.. మళ్లీ ఇలా పాకిస్తానీలకు అవకాశం ఇవ్వడం ఏమిటో! అందరిమీదా.. అన్ని విధాలుగా నిషేధం పెట్టి.. మళ్లీ వీళ్లకు చాన్సులివ్వడం ఎందుకో!