అనుష్క కోహ్లి…. ఒకే బ‌స్సులో..

అనుష్క శ‌ర్మ‌, విరాఠ్ కోహ్లిల ప్రేమ వ్యవ‌హారం తెలియంది కాదు. ఇద్దరూ చాలాసార్లు ల‌వ్ మేట‌ర్‌లో బ‌య‌ట‌ప‌డిపోయారు.  కోహ్లి ఎక్కడ ఆడుతుంటే ఆ మైదానంలో ప్రత్యక్షమైపోతుంటుంది అనుష్క‌. మైదానం వెలుప‌ల వీళ్లిద్దరూ చెట్టాప‌ట్టాలేసుకొని కెమెరాల‌కూ…

అనుష్క శ‌ర్మ‌, విరాఠ్ కోహ్లిల ప్రేమ వ్యవ‌హారం తెలియంది కాదు. ఇద్దరూ చాలాసార్లు ల‌వ్ మేట‌ర్‌లో బ‌య‌ట‌ప‌డిపోయారు.  కోహ్లి ఎక్కడ ఆడుతుంటే ఆ మైదానంలో ప్రత్యక్షమైపోతుంటుంది అనుష్క‌. మైదానం వెలుప‌ల వీళ్లిద్దరూ చెట్టాప‌ట్టాలేసుకొని కెమెరాల‌కూ చిక్కారు. ఆస్ట్రేలియాతో సెమీ ఫైన‌ల్ ఓట‌మిలో అనుష్క శ‌ర్మనీ బాధ్యురాలిని చేస్తూ… ఆమెపై కామెంట్లు విసిరారు నెటింజ‌న్లు. 

ఆ త‌ర‌వాత కోహ్లి ఈ కామెంట్లను కొట్టిప‌రేస్తూ.. అనుష్కని వెన‌కేసుకొచ్చాడు. ఇంత జ‌ర‌గింది… ఇంక ఎందుకు దూరంగా ఉండాలి అనుకొన్నారేమో..?  ఇప్పుడు షికార్ల జోరు మ‌రింత పెంచారు. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆ టీమ్ బ‌స్సులోనే త‌న‌తో పాటు అనుష్కనీ స్టేడియం ద‌గ్గర‌కు తీసుకొస్తున్నాడు. 

బెంగ‌ళూరు టీమ్ బ‌స్సులోనే అనుష్క కూడా ప్రయాణం చేస్తున్న ఫొటోలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  కోహ్లి త‌న టీమ్ మెంబ‌ర్స్‌కి మాత్రమే కేటాయించిన బ‌స్సులోనూ అనుష్కకీ చోటివ్వడం ఇప్పుడు చ‌ర్చనీయాంశ‌మైంది. మ‌రి.. ఇప్పుడు కోహ్లిపై ఎన్ని విమ‌ర్శలు వ‌స్తాయో చూడాలి.