గతాన్ని తవ్వుకుంటే ఎంజాయ్‌ చెయ్యలేం

మనిషి అన్నాక ఎన్నో ఎమోషన్స్‌ వుంటాయి. వయసుకొచ్చాక స్నేహం, కాంక్ష, కోరిక ఇవన్నీ సహజం. యుక్త వయసుల్లో తెలిసో తెలియకో కొన్ని జరిగిపోతాయి. మెచ్యూరిటీ వచ్చేవరకూ ఎమోషన్స్‌ని అదుపు చేసుకోవడం ఎవరికైనా కష్టమే. అలాంటివాటిని…

మనిషి అన్నాక ఎన్నో ఎమోషన్స్‌ వుంటాయి. వయసుకొచ్చాక స్నేహం, కాంక్ష, కోరిక ఇవన్నీ సహజం. యుక్త వయసుల్లో తెలిసో తెలియకో కొన్ని జరిగిపోతాయి. మెచ్యూరిటీ వచ్చేవరకూ ఎమోషన్స్‌ని అదుపు చేసుకోవడం ఎవరికైనా కష్టమే. అలాంటివాటిని తవ్వుకుని ఇబ్బంది పడటం మంచిది కాదని చెబుతుంది బాలీవుడ్‌ హీరోయిన్‌ రాణి ముఖర్జీ. 

ఇటీవల ఎంతోమంది పెళ్ళి తర్వాత తమ కాపురాలు ఇబ్బందుల్లోకి నెట్టేసుకోవడానికి కారణం గతం తవ్వుకోవడమేనని అంటోంది. గతంలో ఇద్దరూ వేరు వేరు జీవితాలు గడుపుతారు. అప్పుడు ఒకరి మీద ఇంకొకరికి హక్కు ఎలా వుంటుంది.? పెళ్ళి అయ్యాక అలాంటివి జరగకుండా చూసుకోవాలి. 

గతం గతః ప్రస్తుతం వున్న వాస్తవాల్ని ఎంజాయ్‌ చెయ్యండి. కేవలం గతంలో ఏవేవో సంబంధాలు అనే అంశాన్ని మర్చిపోమని చెబుతోంది రాణి ముఖర్జీ. అర్థం చేసుకోగల సహృదయం వుంటే దాపరికాలు బద్దలు గొట్టేయండి.. కలిసి బతికినా కలిసి చావలేం కదా. కాబట్టి చీకూ చింతా లేకుండా జీవించమని యువతీ యువకులకు సలహాలు ఇస్తుందావిడ.