Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిజంగా పండగచేస్కోవడమే

నిజంగా పండగచేస్కోవడమే

పండగ చేస్కో..రామ్ హీరోగా రూపొందుతున్న సినిమా. గోపీచంద్ మలినేని దర్శకుడు. ఈ సినిమా ఇప్పటికే కాస్త ఆలస్యమైంది. అయినా ఆ సినిమా నిర్మాతలు పండగచేస్కునే అవకాశం వచ్చిందట. చాన్నాళ్లుగా సినిమాలు కొనడం తగ్గించిన జీ టీవీ ఈ పండగ చేస్కో సినిమాకు ఆరు కోట్లకు పైగా చెల్లించి, శాటిలైట్ హక్కులు తీసుకుందన్నది కాస్త సంచలన వార్త. 

రామ్ మార్కెట్ రీత్యా ఇది కాస్త ఎక్కువ మొత్తమే అనుకోవాలి. మరి కాంబినేషన్ చూసో, సినిమా సబ్జెక్ట్ రీత్యానో జీ టీవీ ఈ మేరకు ఓకె అందని వినికిడి. జీ టీవీ ఇలా మళ్లీ సినిమాలు కొనడం ప్రారంభిస్తే,శాటిలైట్ మార్కెట్ ఊపు వస్తుంది. అది టాలీవుడ్ కు మేలు చేస్తుంది. ఇదిలా వుంటే పండగ చేస్కో సినిమా మే తొలి లేదా రెండోవారంలో విడుదలకు రెడీ అయిపోతోంది.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?