కామెడీ సినిమాల పని భలేగా వుంది. మార్కెట్లోకి పెద్ద హీరో కొత్త సినిమా వచ్చిందో లేదో, డైలాగులు, సీన్లు పారడీ చేసేస్తున్నారు. ఇప్పుడు సన్నాఫ్ సత్యమూర్తి సినిమా డైలాగులను సంపూ బాబు పారడీ చేసేసాడు.
కొబ్బరి మట్ట సినిమాలో. సత్యమూర్తి సినిమా భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత…అంటూ ఓ హెవీ డైలాగు వుంది. అలాంటి డైలాగే సంపూబాబు కూడా చెప్పాడు. కుటుంబం అంటే పాక, భార్య అంటే నచ్చి తెచ్చుకునే తవుడు, పిల్లలు అంటే ఇష్టంతో కలిపే కుడితి, తండ్రి అంటే మగ ఆవు అంట…
కొబ్బరి మట్ట సినిమాలో సంపూ బాబు..పెదరాయుడు, పాపారాయుడు పాత్రలతో పాటు ఆండ్రాయిడు అనే మూడు పాత్రల్లో కనిపిస్తాడని ఝలక్ ఇస్తున్నారు. ఈ సినిమా పాటను ఒకదాన్ని సంపూ బాబే స్వయంగా పాడేసాడు కూడా. ఇన్ని చమక్కులున్న సినిమా మరి ఎలా వుంటుందో చూడాలి.