ఎన్నాళ్ల నుంచో వార్తల్లో నలుగుతోన్న సినిమా జిల్లా. విజయ్, మోహన్ లాల్ నటించిన ఈ సినిమా తమిళనాటు హిట్ అనిపించుకుంది. అప్పటి నుంచి తెలుగులో ఈ సినిమా వాళ్లు చేస్తున్నారు..వీళ్లు చేస్తున్నారు అంటూ వార్తలు వెలువడుతూనే వున్నాయి. రీసెంట్ గా వెంకటేష్, రానా కూడా చేస్తారని గ్యాసిప్ లు వెలువడ్డాయి.
ఆఖరికి ఎవరూ చేయడం లేదు, తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు అన్నది కన్ ఫామ్ అయింది. సురేష్ సంస్థకు సన్నిహితుడైన ఆర్ బి చౌదరి దగ్గర ఈ సినిమా హక్కులు వుండడమే అందుకు కూడ కొంత కారణం. అయితే ఇప్పుడు ఆర్ బి చౌదరితో కలిసి కొందరు కొత్త నిర్మాతలు తెలుగులో అనువదించి విడుదల చేస్తున్నట్లు అధికారిక వార్త వెలువడింది.
అయితే కాస్త నేటివిటీ వుండడం కోసం, బ్రహ్మానందం, ఎల్ బి శ్రీరామ్, సురేఖావాణిలతో కొన్ని కామెడీ సీన్లు రీ షూట్ చేస్తారట. తెలుగులో సరైన టైటిల్ కోసం ఆలోచిస్తున్నారు. అది దొరికాక, పనులు పూర్తయ్యాక విడుదల చేస్తారు. అదీ సంగతి.