ప్రస్తుతానికి నిర్మాణంలో ఏ సినిమా లేదు. అందుకే నిర్మాత బండ్ల గణేష్ విదేశాలు తిరిగేస్తున్నారు. ఆ మధ్య ఆఫ్రికా తిరిగి వచ్చారు. ఇప్పుడు అమెరికా బయల్దేరుతున్నారు. తాను విదేశాల్లో సినిమాలు తీసినపుడు, ఇండియాలో వుండి డబ్బులు పంపడమే తప్ప, వెళ్లింది తక్కువ. అందుకే ఇప్పుడు హాయిగా పర్యటిస్తున్నారు.
Advertisement
ఇదిలా వుంటే బండ్ల తరువాతి సినిమా రామ్ చరణ్ తోనే అని వినికిడి. ఈ విషయం రామ్ చరణ్ స్వయంగా ప్రకటించే వరకు మాట్లాడకూడదని బండ్ల టైట్ లిప్ట్ గా వున్నాడని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకుడు. అంటే శ్రీను వైట్ల తరువాతి ప్రాజెక్టు అన్నమాట.