నాగశౌర్య తక్కువోడేమీ కాదు. బబ్లీగా, లవర్ బాయ్ గా వుండేవాడు, సైలెంట్ గా మాస్ సినిమా చేసేసాడు. పంచ్ డైలాగులు పేల్చాడు..ఫైట్లు చేసాడు. విలన్ కు సవాళ్లు విసిరాడు. ఇదంతా మాస్ ఇమేజ్ కోసమే? జాదూగాడు సినిమా టీజర్ చూసి జనం అనుకుంటున్న మాటలివి. కాస్త గట్టిగా డైలాగులు చెప్పాడు.
'నేను ఫిక్స్ అయితే, ఏ పని చేయడానికైనా సిద్దం. అయితే సాధించాలి. లేదా చావాలి' అన్నది ఓ డైలాగు. 'ఎదగాలన్నా ఆశలోంచి వచ్చింది ధైర్యం' అన్నది మరో డైలాగు. మొత్తానికి టీజర్ కమ్ ట్రయిలర్ బాగానే వుంది. మరి సినిమా ఎలా వుంటుందో చూడాలి.
హిట్ అయితే మనవాడు ఇక మాస్ బాటలో పరుగెడతాడు. లేదంటే మళ్లీ దిక్కులు చూస్తూ, లవ్ లీ సినిమాలు ఎంచుకుంటాడు. అయితే జాదూగాడు సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు యోగేష్ కు కాస్త స్టామినా వుంది కాబట్టి, పాజిటివ్ గానే థింక్ చేద్దాం.