సినిమా సమీక్షలు అందరూ రాయకూడదని, సీనియర్లు మాత్రమే రాయాలని సెలవిచ్చారు నటి సుహాసిని. కంప్యూటర్ వాడడం వచ్చిన అందరూ సమీక్షలు రాస్తే బాగుందని సెటైర్ వేసారు. మంచిదే బాగానే చెప్పారు. మరి టేక్, కట్, ఓకె అనడం వచ్చేసిన ప్రతి ఒక్కరు సినిమాలు తీసేయచ్చా? ఇంట్లోంచి పారిపోయినవాళ్లు, నానా పనులు చేసిన వాళ్లు, చదువు కోని వాళ్లు సైతం సినిమా తీసేస్తున్నారుగా..24 క్రాఫ్ట్స్ కు 24పేపర్లు, నాలుగేళ్లలో రాసి, పాసైన వాళ్లే సినిమాలు తీయడం లేదుగా.
మరి వాటి మాటేమిటి? అసలు సుహాసిని భర్త మణిరత్నం గొప్ప దర్శకుడు. కానీ ఆయన స్వంతంగా తయారుచేసుకున్న కథలెన్ని? భారతం (దళపతి), రామాయణం (రావన్), బైబిల్ (కడలి) సతీసావిత్రి (రోజా) లను అడాప్ట్ చేసుకున్నవేగా. సినిమా కానీ, రచన కానీ సృజనకు సంబంధించినది..దానికి క్వాలిఫికేషన్ కాదు కావాల్సింది. ఈ విషయం సుహాసినికి ఎప్పుడు తెలుస్తుందో.
అవును ఎందుకు ముందుగా సుహాసిని ఈ బంధాలు వేస్తోంది. కొంపదీసి..ఒకె బంగారం? ఒకె కాదా ఏంటీ?