ప్చ్‌.. ఛాన్స్‌లు రావట్లేదు..!

ఓ వివాదాస్పద అంశంతో వార్తల్లో వ్యక్తిగా మారిన శ్వేతా బసు ప్రసాద్‌కి, ఆ వివాదం పబ్లిసిటీ పరంగా బాగానే ఉపయోగపడిరది. హీరోయిన్‌గా ఆమె కెరీర్‌ అటకెక్కిన టైమ్‌లో ఆ ఘటన జరిగింది. ‘ఆ ఘటనతో…

ఓ వివాదాస్పద అంశంతో వార్తల్లో వ్యక్తిగా మారిన శ్వేతా బసు ప్రసాద్‌కి, ఆ వివాదం పబ్లిసిటీ పరంగా బాగానే ఉపయోగపడిరది. హీరోయిన్‌గా ఆమె కెరీర్‌ అటకెక్కిన టైమ్‌లో ఆ ఘటన జరిగింది. ‘ఆ ఘటనతో నాకేం సంబంధం లేదు..’ అని ఇటీవలే మీడియా ముందుకొచ్చి, వివరణ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్‌ గట్స్‌కి హేట్సాఫ్‌ చెప్పారు చాలామంది. రీ`ఎంట్రీలో సత్తా చాటుతా.. అని ఆమె చెప్పినా, టాలీవుడ్‌ నుంచి ఆమెకు తగిన ప్రోత్సాహం దక్కడంలేదాయె.

బాలీవుడ్‌లో ఓ డాక్యుమెంటరీ చేస్తున్న శ్వేతా బసు ప్రసాద్‌కి, తెలుగులో ఒకే ఒక్క సినిమా ఆఫర్‌ వుందట. ఆ ఆఫర్‌ సంగతెలా వున్నా, ఐటమ్‌ గర్ల్‌గా మారిన శ్వేతకి, ఆ తరహా అవకాశాలే వస్తుండడంతో, ‘ఇకపై కెరీర్‌లో ముందుకెళ్ళేదెలా.?’ అనే డైలమాలో పడిపోయింది. తొలి సినిమా నుంచీ, ఆమె పలు సందర్భాల్లో వివాదాల్నే కొనితెచ్చుకుంది. ఓ సినిమా విషయంలో నిర్మాతతో విభేదాలు కొనితెచ్చుకుంది. అలా ఆమె కెరీర్‌ అటకెక్కిపోయింది. వివాదాల్లేకుండా కెరీర్‌ని కొనసాగించి వుంటే, ఆమె పరిస్థితి ఇంకోలా వుండేదేమో. 

మొత్తమ్మీద, రీ-ఎంట్రీలో సక్సెస్‌ అవుతాననే కాన్ఫిడెన్స్‌ మాత్రం శ్వేతలో ఇంకా కన్పిస్తోంది. కానీ, అవకాశాలే ఆమెను వెక్కిరిస్తున్నాయి. బాలీవుడ్‌లో ఆమె రూపొందిస్తున్న డాక్యుమెంటరీతో అయినా ఆమె దశ మారుతుందేమో వేచి చూడాలి.