అంత దరిద్రంగా ఎలా రాస్తారో అర్థం కాదంటుంది

ఇప్పుడు పత్రికల్లోనే కాదు, టీవీల్లో ఫేస్‌ బుక్‌లో ట్విట్టర్‌లో కంగాలీ న్యూస్‌లు వచ్చేసి ఆర్టిస్టుల్ని, హీరోయిన్స్‌నీ తెగ ఇబ్బంది పెట్టేస్తున్న మాట వాస్తవమే. అయితే తన గురించి మరీ దారుణంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టడం…

ఇప్పుడు పత్రికల్లోనే కాదు, టీవీల్లో ఫేస్‌ బుక్‌లో ట్విట్టర్‌లో కంగాలీ న్యూస్‌లు వచ్చేసి ఆర్టిస్టుల్ని, హీరోయిన్స్‌నీ తెగ ఇబ్బంది పెట్టేస్తున్న మాట వాస్తవమే. అయితే తన గురించి మరీ దారుణంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టడం గురించి సెక్సీ యాంకర్‌ అనసూయ లబోదిబోమంటుంది. 

అనసూయ టాలెంట్‌కి ముగ్ధుడయిన అక్కినేని నాగార్జున ఆమెకు ఓ సినిమాలో ఛాన్స్‌ ఇచ్చాడట. దాంతో మన కుర్రాళ్ళు రెచ్చిపోయి, నాగార్జునని పట్టేసిన అనసూయ.. అనీ, యాంకర్‌ మోజులో ముదురు హీరో అనీ.. ఇలా రకరకాలుగా తన గురించి రాసి పోస్ట్‌లు చెయ్యడం గురించి అనసూయ ఎంతో ఇబ్బంది పడుతుందట. 

ఇంత దరిద్రంగా ఎందుకు రాస్తారో తనకు అర్థం కావడంలేదని కూడా వాపోతుంది. నాగార్జున లాంటి అరిస్ట్రోక్రాట్‌ ముందు తాను ఆప్ట్రాల్‌ అనీ, తన కారణంగా నాగార్జునగారి ఇమేజ్‌కి భంగం కలిగే రాతలు రాయొద్దని అనసూయ వేడుకుంటుంది. 

నిజమే మరి. రాసే వాళ్ళు కాస్త సంస్కారం ప్రదర్శిస్తే ఎవ్వరినీ నొప్పించకుండా వుండొచ్చు. అనసూయ చెప్పింది నిజమే మరి.