నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన పటాస్ చిత్రానికి యునానిమస్ హిట్ టాక్ వచ్చింది. అనిల్ రావిపూడి తీసిన పక్కా కమర్షియల్ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఈ చిత్రం వసూళ్లు ఊహించిన దానికంటే బాగుండడంతో అన్ని ఏరియాల్లో థియేటర్లు పెంచుతున్నారు.
ఆదివారం, రిపబ్లిక్ డే హాలీడేని క్యాష్ చేసుకోవడానికి పటాస్ చిత్రానికి అన్ని ఏరియాల్లో థియేటర్లు పెంచుతున్నారు. దీంతో పాటుగా విడుదలైన బీరువా చిత్రం డీలా పడడంతో, సంక్రాంతి సినిమాల సందడి ఆల్రెడీ తగ్గడంతో పటాస్ చిత్రానికే కలెక్షన్లున్నాయి. ఈ చిత్రానికి వచ్చిన టాక్‌ని పూర్తిగా క్యాష్ చేసుకోవడానికి బయ్యర్లు పావులు కదుపుతున్నారు.
ఈమధ్య కాలంలో మాస్ ఆడియన్స్‌ని ఇంతగా అలరించిన సినిమా ఏదీ రాలేదు. కళ్యాణ్‌రామ్ సినిమా కనుక రిలీజ్ చాలా మామూలుగానే ప్లాన్ చేసారు. కానీ టికెట్ల కోసం డిమాండ్ ఉండడంతో, థియేటర్ల వద్ద రద్దీ పెరగడంతో ఉన్నపళంగా థియేటర్లు పెంచేసారు. ఈ జోరుతో ఈ చిత్రం వారం తిరగకుండానే లాభాల్లోకి వెళుతుందని భావిస్తున్నారు.