Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రవితేజ, ఇలియానాల కొడుకే..

రవితేజ, ఇలియానాల కొడుకే..

రవితేజతో సురేందర్‌ రెడ్డి రూపొందిస్తోన్న కిక్‌ 2 చిత్రం టీజర్‌ రవితేజ బర్త్‌డే సందర్భంగా ఈ అర్థరాత్రి రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం స్టోరీ లైన్‌ ఏంటనేది రివీల్‌ చేసారు. కిక్‌ సినిమా చివర్లో రవితేజ, ఇలియానాలకి పుట్టిన కొడుకు కూడా కిక్‌ కోసం పాకులాడుతున్నట్టు చూపించిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఆ కొడుకు పెరిగి పెద్దవాడై రవితేజ అయినట్టు... అతను కిక్‌ కోసం ఏం చేస్తాడు అనేది కిక్‌ 2లో చూపిస్తున్నారట. కిక్‌కి కొనసాగింపే ఈ చిత్రమని, హీరో క్యారెక్టరైజేషన్‌ మినహా మిగతా అంతా చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. వరుసగా రెండు విజయాలు సాధించిన ఉత్సాహంలో ఉన్న రవితేజ హ్యాట్రిక్‌ కంప్లీట్‌ చేయాలని చూస్తున్నాడు. 

సురేందర్‌ రెడ్డి కూడా రేసుగుర్రంతో టాప్‌ డైరెక్టర్ల సరసన చేరిపోయాడు. కిక్‌ 2పై ఉన్న అంచనాలకి తగ్గట్టే మరో బ్లాక్‌బస్టర్‌ ఇవ్వాలని అతను ట్రై చేస్తున్నాడు. రవితేజ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్‌లో కిక్‌ 2 ప్రేక్షకుల ముందుకి రానుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?