మహేష్‌ పరువు తీయడం కాకపోతే..!

వంద రోజుల జమానా అయిపోయిందనేది ఇటు ఇండస్ట్రీకి, అటు ఫాన్స్‌కి క్లియర్‌గా తెలిసిపోయింది. అయినప్పటికీ కనీసం ఒకటీ అరా సెంటర్లలో అయినా వంద రోజులు ఆడిరచాలనే సరదా పడుతున్నారు కొందరు. ఇటీవలే 1 నేనొక్కడినే…

వంద రోజుల జమానా అయిపోయిందనేది ఇటు ఇండస్ట్రీకి, అటు ఫాన్స్‌కి క్లియర్‌గా తెలిసిపోయింది. అయినప్పటికీ కనీసం ఒకటీ అరా సెంటర్లలో అయినా వంద రోజులు ఆడిరచాలనే సరదా పడుతున్నారు కొందరు. ఇటీవలే 1 నేనొక్కడినే వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుందనే ప్రకటన వచ్చింది. తాటిపాక అనే ఒకే ఒక్క కేంద్రంలో ఇది వంద రోజుల పాటు పాకిందట!

1 ఎంతటి డిజాస్టర్‌ అనేది అందరికీ తెలిసిన విషయమే అయినా బలవంతంగా ఒక సెంటర్‌లో నడిపించి దానికి గర్వంగా ప్రకటన ఇచ్చుకోవడం మహేష్‌ పరువు తీయడం కాదా? ఇప్పుడు సినిమా విజయాన్ని సెంటర్స్‌తో కాకుండా కోట్లతో కొలుస్తున్నారు. ఒక సినిమా ఎంత వసూలు చేసిందనేది దాని హిట్టుకి కొలమానం. ఒకవేళ నిజంగా సినిమాలో దమ్ముండి వంద రోజులు ఆడితే ఒక పాతిక కేంద్రాల్లో అయినా నడిచినప్పుడు సెంటర్లు చెప్పుకుంటే బాగుంటుంది. 

ఎవడు సినిమాకి కూడా మూడు కేంద్రాల్లో వంద రోజుల రన్‌ వచ్చిందని చెప్పుకున్నారు. ఏం.. ఈ మూడు సెంటర్లలో వంద ఆడకపోతే ఇది సక్సెస్‌ అని ఒప్పుకోరా? ఇలా ఒకటీ అరా కేంద్రాల్లో ఆడిరదని చెప్పుకోవడం తమకే పరువు నష్టం కనుక హీరోలే ఇలాంటివి మానుకోండని నిర్మాతలకి తేల్చి చెప్పాల్సిందే. లేదంటే తమ డాంభీకాల కోసం నిర్మాతలు ఎలాంటి ప్రకటనలైనా ఇచ్చేస్తారు.