ఫైట్ కు రెండు కోట్లా?

పెద్ద హీరోలతో సినిమా అంటే నిర్మాతలకు పూనకం వచ్చేస్తుంది. కిందా మీదా చూడకుండా ఖర్చు చేసేస్తారు. తీరా విడుదల నాటకి బడ్జెట్ బారెడైపోయిందని లబోదిబో అంటారు. హీరో స్టామినా, కలెక్షన్ల రేంజి మరిచిపోతే కష్టమే…

పెద్ద హీరోలతో సినిమా అంటే నిర్మాతలకు పూనకం వచ్చేస్తుంది. కిందా మీదా చూడకుండా ఖర్చు చేసేస్తారు. తీరా విడుదల నాటకి బడ్జెట్ బారెడైపోయిందని లబోదిబో అంటారు. హీరో స్టామినా, కలెక్షన్ల రేంజి మరిచిపోతే కష్టమే కదా? బలుపు హిట్ తప్ప మరో సినిమా లేని రవితేజతో ఇప్పుడు పవర్ సినిమా చేస్తున్నాడు. 

ఈ సినిమా కోసం ఓ ఫైట్ ను రెండు కోట్ల ఖర్చుతో తీసారట. బ్యాంకాక్ అంటే మనవాళ్లు చేజ్ అంటారు. అక్కడి ఫైటర్లతో మేడలు, మిద్దెలు దూకించేస్తారు. దానికి వాళ్లు భారీగానే వసూలు చేస్తారు. పవర్ సినిమాలోనూ ఇదే జరిగింది. రెండు కోట్లు వదిలింది. 

ఇప్పడు చెప్పకోవడానికి, సినిమా అమ్ముకోవడానికి బాగానే వుంటుంది. కానీ తీరా బడ్జెట్ దాటిపోయాక, వసూళ్లు, టార్గెట్ కు జానెడు దూరంలో ఆగిపోయాక తెలుస్తుంది. అదేదో ముందే జాగ్రత్తపడడం మన నిర్మాతలు ఎప్పుడు నేర్చుకుంటారో?