లెజెండ్ సినిమా నిర్మాతలను పూర్తిగా గట్టెంచకున్నా, బోయపాటిని ఓ మెట్టు పైకెక్కించేసింది. అమాంతం తన రేటును ఎనిమిది కోట్లకు పెంచేసాడని వినికిడి. కొత్త నిర్మాతలకు ఎనిమిదికి ఓకె అంటేనే అంటున్నాడట. అయితే ప్రస్తుతం చరణ్ తో చేస్తున్న సినిమాకు ఆరే తీసుకున్నాడని వినికిడి. ఎంతయినా ఒక్క హిట్ కొడితే ఆ కిక్కే వేరప్పా.
సింహా తరువాత కూడా ఇదే పరిస్థితి. దమ్ముకు ఆరు పలికింది. ఆ తరువాత మూడన్నా వచ్చేవారు లేకపోయారు. ఆఖరికి లెజెండ్ నిర్మాతలు దొరికారు. నాలుగు ఇచ్చారు. హిట్ కొట్టాడు. దాంతో మళ్లీ బోయపాటి దశ తిరిగేసింది. అయినా మార్కెట్ అంతే డిమాండ్ మీదే ధర ఆధారపడి వుంటుందన్నది చిన్నప్పుడు చదువుకున్న పాఠమే కదా?